Wednesday, 11 March 2026 11:43:05 AM
# సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన # అంగన్వాడీ టీచర్ ఒడ్డేపల్లి రాజేశ్వరికు బెస్ట్ టీచర్ అవార్డు # టేకులబస్తిలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ స్లాబ్ పనులు ప్రారంభం # విలేకరి చంద్రశేఖర్‌పై నమోదైన కేసు రద్దు చేయాలి: బీజేపీ నాయకుడు కొయ్యల ఏమాజి # బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్ కూనురాజుల సమ్మక్కకు పిహెచ్డీ డాక్టరేట్ # మందమర్రి పెద్ద మసీదులో రంజాన్ తోఫా కార్యక్రమం… మంత్రి వివేక్ వెంకటస్వామి, కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొనం # నాగర్ గూడ శివారులో సీజ్ చేసిన ఇసుకకు బహిరంగ వేలం # బీజేపీ పోరాటంతో భూదాన్ బాధితులకు ఇళ్ల పట్టాలు # కోమట్లగూడెం గ్రామంలో శ్రీ అంకమ్మ తల్లి జాతర సందర్భంగా డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం # కుషాయిగూడలో ఘనంగా రేణుక ఎల్లమ్మ–జమదగ్ని మహాముని కళ్యాణ మహోత్సవం

Tramadol: నొప్పి నివారిణి ట్రమడోల్‌తో గుండెకు తీవ్ర ప్రమాదం

Date : 13 October 2025 07:40 PM Views : 129

Studio18 News - ఆరోగ్యం / : ప్రయోజనం కన్నా దుష్ప్రభావాలే రెట్టింపు అని వెల్లడి బీఎంజే మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం దీర్ఘకాలం వాడితే గుండె జబ్బుల ముప్పు మరింత అధికం దాదాపు 6,500 మందిపై జరిపిన పరిశోధనలో వెల్లడి నొప్పి నుంచి ఉపశమనం కోసం వైద్యులు సూచించే సాధారణ పెయిన్ కిల్లర్ 'ట్రమడోల్'తో తీవ్రమైన గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం హెచ్చరించింది. ఈ మాత్ర వల్ల నొప్పి తగ్గడం పరిమితంగానే ఉన్నప్పటికీ, గుండె సంబంధిత దుష్ప్రభావాలు మాత్రం రెట్టింపు స్థాయిలో ఉన్నాయని పరిశోధకులు తేల్చారు. ఈ సంచలన విషయాలు ‘బీఎంజే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్’ అనే ప్రముఖ వైద్య పత్రికలో ప్రచురితమయ్యాయి. అధ్యయనంలో భాగంగా పరిశోధకులు సుమారు 6,506 మంది క్లినికల్ ట్రయల్స్ డేటాను విశ్లేషించారు. వీరి సగటు వయసు 58 సంవత్సరాలు కాగా, వీరంతా 2 నుంచి 16 వారాల పాటు ట్రమడోల్ మాత్రలను వాడారు. ఈ పరిశీలనలో ట్రమడోల్ వాడకం వల్ల నొప్పి నుంచి లభించే ఉపశమనం చాలా స్వల్పమని తేలింది. అయితే, దీని దుష్ప్రభావాలు మాత్రం తీవ్రంగా ఉన్నట్లు స్పష్టమైంది. ముఖ్యంగా ఛాతీ నొప్పి, కరోనరీ ఆర్టరీ వ్యాధి, గుండె వైఫల్యం (హార్ట్ ఫెయిల్యూర్) వంటి సమస్యల ప్రమాదం గణనీయంగా పెరుగుతున్నట్లు గుర్తించారు. సాధారణంగా ఎలాంటి మందు లేని ప్లాసిబో మాత్రలతో పోల్చినప్పుడు, ట్రమడోల్ వాడిన వారిలో సైడ్ ఎఫెక్ట్స్ రెట్టింపు ఉన్నాయని ఈ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా దీర్ఘకాలం పాటు ఈ మాత్రను వినియోగించే వారిలో గుండెకు ముప్పు మరింత ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో ప్రతి ఐదుగురిలో ఒకరు, అంటే సుమారు 5.16 కోట్ల మంది తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో చాలామందికి వైద్యులు ట్రమడోల్‌ను సూచిస్తున్నారు. తాజా అధ్యయనం నేపథ్యంలో, ఈ నొప్పి నివారిణి వాడకంపై పునఃపరిశీలన చేయాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :