Friday, 13 March 2026 02:01:14 PM
# ఏల్గొండ గూడ పాఠశాలకు దాత సహాయం # నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి # శ్రీపాద ఎల్లంపల్లి నీరు రుద్రంగికి చేరిక… రైతుల్లో ఆనందం # ఇన్నోవేషన్ పంచాయత్ కార్యక్రమానికి యువత ముందుకు రావాలి: కలెక్టర్ రాజర్షి షా # వేములవాడలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు – 8 మందికి జైలు శిక్ష, 106 మందికి జరిమానాలు # వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి హుండీ ద్వారా రూ.2.16 కోట్ల ఆదాయం # పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # వేములవాడ ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ లేమి – గర్భిణీలకు ఇబ్బందులు # నిర్మల్ జిల్లాలో నారి శక్తి కార్యక్రమం: డయల్-100కు సత్వర స్పందన, అవగాహన కార్యక్రమాలు # పదవ తరగతి విద్యార్థినులకు పెన్నులు, ఎగ్జామ్ ప్యాడ్ల పంపిణీ # జన్నారం మండలంలో నూతన గ్రామ పంచాయతీ భవనాల ప్రారంభం # ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో శిక్షణ ముగింపు కార్యక్రమం # ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి సాధిద్దాం: కలెక్టర్ అభిలాష అభినవ్ # వనస్థలిపురంలో గ్రాండ్ ఇఫ్తార్ పార్టీలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు # ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు శిక్షణ # పీజీ సీట్లు సాధించిన వైద్యులకు బీఆర్ఎస్ నాయకుల ఘన సన్మానం # షాబాద్‌లో మెడికల్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య # పలు వివాహ వేడుకలకు హాజరైన మల్‌రెడ్డి రాంరెడ్డి # బంజారా మహిళ హత్యపై నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ # నూతన వధూవరులను ఆశీర్వదించిన దేప భాస్కర్ రెడ్డి

Health Tips: రోజుకు 2.5 లీటర్ల నీరు తాగితే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే అవాక్కే..

హైడ్రేటెడ్‌గా ఉండటానికి, మనం రోజూ 2 నుండి 3 లీటర్ల నీరు త్రాగాలి అని ఎప్పుడూ చెబుతుంటారు. ఇది మన మొత్తం ఆరోగ్యానికి చాలా అవసరం. కొంతమంది డీటాక్స్ వాటర

Date : 18 September 2025 08:56 PM Views : 192

Studio18 News - ఆరోగ్యం / : మనిషికి నీరు ఎంతో అవసరం. నీరు లేకపోతే మనం ఉండలేం. వైద్యులు కూడా పుష్కలంగా నీరు తాగాలని చెబుతారు. రోజుకు 2 నుంచి 3 లీటర్ల వరకు నీరు తాగాలని చెబుతారు. అయితే ఈ మొత్తం అందరికీ సరిపోతుందా..? లేదా అంతకంటే ఎక్కువ అవసరమా? అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి. ఈ ప్రశ్నలకు నిపుణుల ఏమంటున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం. 2.5 లీటర్ల నీరు సరిపోతుందా..? అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌లోని ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ రోహిత్ శర్మ ప్రకారం.. రోజుకు 2.5 లీటర్ల నీరు తాగడం సాధారణంగా సరిపోతుంది. అయితే ఇది వ్యక్తి శరీర బరువు, వయస్సు, వాతావరణం, ఆరోగ్య పరిస్థితులు, వారి దైనందిన కార్యకలాపాలపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. ఉదాహరణకు.. ఎండాకాలంలో ఎక్కువ నీరు తాగడం అవసరం. అలాగే వ్యాయామం చేసేవారు లేదా శారీరకంగా ఎక్కువగా శ్రమించే వారికి కూడా ఎక్కువ నీరు అవసరం. నీటితో పాటు, పండ్లు, కూరగాయలు వంటి నీరు అధికంగా ఉండే ఆహారాలు కూడా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి సహాయపడతాయి. డీటాక్స్ డ్రింక్స్ అవసరమా? మన శరీరం సహజంగానే విషపదార్థాలను బయటకు పంపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రక్రియను ముఖ్యంగా కాలేయం, జీర్ణ వ్యవస్థ నిర్వహిస్తాయి. కాబట్టి డీటాక్స్ పానీయాలు తప్పనిసరి కాదని వారు అంటున్నారు. ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోవడం, సరైన మోతాదులో నీరు తాగడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటివి ఆరోగ్యంగా ఉండటానికి చాలా ముఖ్యం. డీటాక్స్ పానీయాల వల్ల బరువు తగ్గడం, ఆరోగ్యం మెరుగుపడడం వంటి ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ, శాస్త్రీయంగా అవి ఇంకా పూర్తిగా నిరూపించబడలేదు. ఏదైనా డీటాక్స్ పానీయం తీసుకోవాలంటే ముందుగా నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది. ఎక్కువగా లేదా తక్కువగా తాగడం హానికరం..! రోజుకు 2 నుంచి 3 లీటర్ల నీరు తాగడం ఒక సాధారణ వ్యక్తికి అనువైనది. కానీ చాలా తక్కువ నీరు తాగితే అలసట, తలనొప్పి, పొడి చర్మం వంటి సమస్యలు వస్తాయి. అదేవిధంగా శరీర అవసరాలకు మించి ఎక్కువ నీరు తాగడం కూడా ప్రమాదకరం. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతుల్యతను దెబ్బతీసి, వాంతులు, బలహీనత వంటి సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి, దాహం వేసినప్పుడు మాత్రమే కాకుండా క్రమం తప్పకుండా నీరు తాగుతూ ఉండాలి. అంతేకాకుండా మీకు మూత్రపిండాల సమస్యలు వంటి ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, ఎంత నీరు తాగాలి అనే విషయంపై వైద్యుడిని సంప్రదించాలి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :