Wednesday, 11 March 2026 11:41:33 AM
# సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన # అంగన్వాడీ టీచర్ ఒడ్డేపల్లి రాజేశ్వరికు బెస్ట్ టీచర్ అవార్డు # టేకులబస్తిలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ స్లాబ్ పనులు ప్రారంభం # విలేకరి చంద్రశేఖర్‌పై నమోదైన కేసు రద్దు చేయాలి: బీజేపీ నాయకుడు కొయ్యల ఏమాజి # బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్ కూనురాజుల సమ్మక్కకు పిహెచ్డీ డాక్టరేట్ # మందమర్రి పెద్ద మసీదులో రంజాన్ తోఫా కార్యక్రమం… మంత్రి వివేక్ వెంకటస్వామి, కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొనం # నాగర్ గూడ శివారులో సీజ్ చేసిన ఇసుకకు బహిరంగ వేలం # బీజేపీ పోరాటంతో భూదాన్ బాధితులకు ఇళ్ల పట్టాలు # కోమట్లగూడెం గ్రామంలో శ్రీ అంకమ్మ తల్లి జాతర సందర్భంగా డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం # కుషాయిగూడలో ఘనంగా రేణుక ఎల్లమ్మ–జమదగ్ని మహాముని కళ్యాణ మహోత్సవం

Bones Health | మీ ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజూ వీటిని తినండి..!

ఒక‌ప్పుడు మ‌న పెద్ద‌లు, పూర్వీకులు చాలా ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తినేవారు. అందుక‌నే వారు వృద్దాప్యంలోనూ అంత ఆరోగ్యంగా ఉండేవారు. ఎలాంటి శారీరక శ్ర‌మ‌ను అయి

Date : 11 September 2025 07:25 PM Views : 120

Studio18 News - ఆరోగ్యం / : Bones Health | ఒక‌ప్పుడు మ‌న పెద్ద‌లు, పూర్వీకులు చాలా ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తినేవారు. అందుక‌నే వారు వృద్దాప్యంలోనూ అంత ఆరోగ్యంగా ఉండేవారు. ఎలాంటి శారీరక శ్ర‌మ‌ను అయినా స‌రే చాలా అలవోక‌గా చేయ‌గ‌లిగేవారు. ముఖ్యంగా వారు ఆరోగ్య‌క‌ర‌మైన దేహంతోపాటు దృఢ‌మైన ఎముక‌ల‌ను సైతం క‌లిగి ఉండేవారు. అందుక‌నే వారికి అంత బ‌లం ఉండేది. అయితే ప్ర‌స్తుతం చాలా మంది చిన్న వ‌య‌స్సులోనే ఎముక‌ల సంబంధిత స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. యుక్త వ‌య‌స్సులో ఉన్న‌వారికి కూడా ఆర్థ‌రైటిస్ వంటి స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. పోష‌కాహారం తీసుకోక‌పోవ‌డ‌మే ఇందుకు ప్ర‌ధాన కార‌ణ‌మని పోష‌కాహార నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. క‌నుక ఎముక‌లు ఆరోగ్యంగా ఉండాలంటే పోష‌కాలు ఉన్న ఆహారాల‌ను తినాల్సి ఉంటుంది.

క్యాల్షియం.. ఎముక‌ల ఆరోగ్యానికి కేవ‌లం క్యాల్షియం మాత్రమే స‌రిపోతుంద‌ని చాలా మంది భావిస్తారు. కానీ దాంతోపాటు విట‌మిన్ డి కూడా ఉండాల్సిందే. అలాగే ఫాస్ఫ‌ర‌స్‌, మెగ్నిషియం వంటి మిన‌ర‌ల్స్ ఉండే ఆహారాల‌ను తిన‌డం కూడా అవ‌స‌ర‌మే. ఇవ‌న్నీ ఉండే ఆహారాల‌ను తింటేనే ఎముక‌లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఎముక‌లు ఆరోగ్యంగా దృఢంగా ఉండేందుకు గాను క్యాల్షియం ఎంతో దోహ‌దం చేస్తుంది. ఇది ఎముక‌ల సాంద్ర‌తను పెంచి ఎముక‌ల‌ను దృఢంగా మారేలా చేస్తుంది. ఎముక‌ల నిర్మాణానికి, ఎముక‌లు త్వ‌ర‌గా అతుక్కోవ‌డానికి స‌హాయం చేస్తుంది. క్యాల్షియం మ‌న‌కు పాలు, పెరుగు, చీజ్‌, ప‌నీర్ వంటి ఆహారాల్లో అధికంగా ల‌భిస్తుంది. అలాగే పాల‌కూర‌ను తింటున్నా కూడా క్యాల్షియం స‌మృద్ధిగానే ల‌భిస్తుంది. తోట‌కూర‌లో ఉండే విట‌మిన్ కె ఎముక‌ల‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. క‌నుక దీన్ని కూడా త‌ర‌చూ తినాలి. విట‌మిన్ డి.. బాదంపాలు, సోయా పాలు, తృణ ధాన్యాలు, నారింజ ర‌సం వంటి వాటిని తీసుకుంటున్నా కూడా క్యాల్షియంను అధిక మొత్తంలో పొంద‌వ‌చ్చు. చేప‌ల్లోనూ క్యాల్షియం అధిక మొత్తంలో ఉంటుంది. ఇది ఎముక‌ల‌ను ఆరోగ్యంగా ఉంచేందుకు స‌హాయం చేస్తుంది. ఇక ఎముక‌ల ఆరోగ్యానికి విట‌మిన్ డి కూడా ఎంతో అవ‌స‌రం. శ‌రీరంలో విట‌మిన్ డి త‌గిన మొత్తంలో ఉంటేనే మ‌నం తిన్న ఆహారాల్లో ఉండే క్యాల్షియంను శ‌రీరం స‌రిగ్గా శోషించుకుంటుంది. విట‌మిన్ డి మ‌న‌కు చేప‌ల్లో అధికంగా ల‌భిస్తుంది. పాల‌, నారింజ ర‌సం కూడా తీసుకోవచ్చు. తృణ ధాన్యాల‌ను తింటున్నా కూడా ఉప‌యోగం ఉంటుంది. కోడిగుడ్డు ప‌చ్చ సొన‌లో విట‌మిన్ డి అధిక మొత్తంలో ల‌భిస్తుంది. పుట్ట గొడుగుల‌ను తిన‌డం వ‌ల్ల కూడా ఈ విట‌మిన్ ను పొంద‌వ‌చ్చు. విట‌మిన్ కె.. విట‌మిన్ కె అధికంగా ఉండే ఆహారాల‌ను తింటున్నా కూడా ఎముక‌ల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు. విట‌మిన్ కె వ‌ల్ల ఎముకలు నిర్మాణ‌మ‌వ‌డంతోపాటు ఎముక‌ల‌కు బ‌లం ల‌భిస్తుంది. విట‌మిన్ కె మ‌న‌కు పాల‌కూర‌, తోట‌కూర వంటి ఆకుకూర‌ల‌తోపాటు బ్రోక‌లీలోనూ ల‌భిస్తుంది. సోయాబీన్స్ ను తింటున్నా కూడా ఉప‌యోగం ఉంటుంది. మెగ్నిషియం అధికంగా ఉండే న‌ట్స్‌, విత్త‌నాలు, ప‌ప్పు దినుసులను తినడం వ‌ల్ల ఎముక‌లు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. మెగ్నిషియం వ‌ల్ల విట‌మిన్ డిని శ‌రీరం స‌రిగ్గా శోషించుకుంటుంది. ఫాస్ఫ‌ర‌స్ కూడా ఎముక‌ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది మాంసం, తృణ ధాన్యాల్లో అధికంగా ల‌భిస్తుంది. ఇలా ఆయా ఆహారాల‌ను తింటుంటే ఎముక‌లు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :