Friday, 13 March 2026 02:01:14 PM
# ఏల్గొండ గూడ పాఠశాలకు దాత సహాయం # నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి # శ్రీపాద ఎల్లంపల్లి నీరు రుద్రంగికి చేరిక… రైతుల్లో ఆనందం # ఇన్నోవేషన్ పంచాయత్ కార్యక్రమానికి యువత ముందుకు రావాలి: కలెక్టర్ రాజర్షి షా # వేములవాడలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు – 8 మందికి జైలు శిక్ష, 106 మందికి జరిమానాలు # వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి హుండీ ద్వారా రూ.2.16 కోట్ల ఆదాయం # పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # వేములవాడ ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ లేమి – గర్భిణీలకు ఇబ్బందులు # నిర్మల్ జిల్లాలో నారి శక్తి కార్యక్రమం: డయల్-100కు సత్వర స్పందన, అవగాహన కార్యక్రమాలు # పదవ తరగతి విద్యార్థినులకు పెన్నులు, ఎగ్జామ్ ప్యాడ్ల పంపిణీ # జన్నారం మండలంలో నూతన గ్రామ పంచాయతీ భవనాల ప్రారంభం # ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో శిక్షణ ముగింపు కార్యక్రమం # ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి సాధిద్దాం: కలెక్టర్ అభిలాష అభినవ్ # వనస్థలిపురంలో గ్రాండ్ ఇఫ్తార్ పార్టీలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు # ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు శిక్షణ # పీజీ సీట్లు సాధించిన వైద్యులకు బీఆర్ఎస్ నాయకుల ఘన సన్మానం # షాబాద్‌లో మెడికల్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య # పలు వివాహ వేడుకలకు హాజరైన మల్‌రెడ్డి రాంరెడ్డి # బంజారా మహిళ హత్యపై నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ # నూతన వధూవరులను ఆశీర్వదించిన దేప భాస్కర్ రెడ్డి

ఇలా చేస్తే చాలు.. శీతాకాలంలో విటమిన్-డీ పుష్కలంగా లభ్యం

రోజుకు రెండు గుడ్లు తింటే శరీరానికి అందనున్న విటమిన్-డీ శీతాకాలంలో ఎముకల నొప్పులకు కూడా చెక్ జుట్టు రాలడం, చర్మ సమస్యలను కూడా నివారించవచ్చంటున్న వైద్య

Date : 20 December 2024 01:24 PM Views : 317

Studio18 News - ఆరోగ్యం / : శీతాకాలంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవడం సహజం. అయితే, ఈ అత్యల్ప ఉష్ణోగ్రతల పరిస్థితులు అనేక అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంటాయి. శరీరంలో అంతర్గతంగా అవసరమైన ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం, రక్త ప్రసరణ మందగించడం, ఎముకల నొప్పులు, జుట్టు రాలడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే, ఆహారంలో చిన్నపాటి మార్పు చేసుకుంటే చాలా సమస్యలను అధిగమించవచ్చు. చలికాలంలో ప్రతిరోజూ 2 గుడ్లు తింటే చక్కటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గుడ్లలో అధిక ప్రోటీన్లు, ఒమేగా-3తో పాటు కొన్ని విటమిన్లు లభిస్తాయని, ఇవి శీతాకాలంలో వచ్చే అనేక సమస్యలను దూరం చేస్తాయని సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా గుడ్ల ద్వారా పుష్కలంగా లభించే విటమిన్-డీ ఎముకలు, మెదడు కణాల పనితీరును మెరుగుపరచడంలో చక్కగా ఉపయోగపడుతుంది. మనం తినే గుడ్లు శరీరంలో కొలెస్ట్రాల్‌‌గా మారి నిల్వ అవుతాయి. దాని నుంచి శరీరం విటమిన్-డీని ఉత్పత్తి చేసుకుంటుందని వైద్యులు చెబుతున్నారు. బరువు తగ్గుదలకు కూడా గుడ్లు బాగా ఉపయోగపడతాయి. అధిక ప్రోటీన్ల కారణంగా కడుపు నిండుగా ఉంటుంది. ఫలితంగా తీసుకునే ఆహారం తగ్గుతుందని అంటున్నారు. హార్మోన్ల పనితీరును కూడా సమతుల్యం చేస్తుంది. తద్వారా శరీర బరువు తగ్గుదలలో గుడ్లు బాగా దోహదపడతాయని వైద్యులు సలహా ఇస్తున్నారు. గుడ్లలో పుష్కలంగా లభించే విటమిన్-డీ, జింక్ పదార్థాలు ఎముకలు గట్టిపడడానికి ఉపయోగపడతాయి. కాబట్టి, రోజు రెండు గుడ్లు తింటే చలికాలంలో కీళ్ల నొప్పుల వంటి ఎముకల సమస్యలను నివారిస్తుందని చెబుతున్నారు. ఇక, గుడ్లలో లభించే విటమిన్-బీ జట్టు రాలే సమస్యను కూడా తగ్గిస్తుంది. చర్మం, గోళ్ల ఆరోగ్యానికి కూడా విటమిన్-బీ ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు

Also Read : మహారాష్ట్రలో కొత్త అల్లుడిపై మామ యాసిడ్ దాడి

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :