Wednesday, 11 March 2026 11:42:39 AM
# సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన # అంగన్వాడీ టీచర్ ఒడ్డేపల్లి రాజేశ్వరికు బెస్ట్ టీచర్ అవార్డు # టేకులబస్తిలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ స్లాబ్ పనులు ప్రారంభం # విలేకరి చంద్రశేఖర్‌పై నమోదైన కేసు రద్దు చేయాలి: బీజేపీ నాయకుడు కొయ్యల ఏమాజి # బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్ కూనురాజుల సమ్మక్కకు పిహెచ్డీ డాక్టరేట్ # మందమర్రి పెద్ద మసీదులో రంజాన్ తోఫా కార్యక్రమం… మంత్రి వివేక్ వెంకటస్వామి, కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొనం # నాగర్ గూడ శివారులో సీజ్ చేసిన ఇసుకకు బహిరంగ వేలం # బీజేపీ పోరాటంతో భూదాన్ బాధితులకు ఇళ్ల పట్టాలు # కోమట్లగూడెం గ్రామంలో శ్రీ అంకమ్మ తల్లి జాతర సందర్భంగా డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం # కుషాయిగూడలో ఘనంగా రేణుక ఎల్లమ్మ–జమదగ్ని మహాముని కళ్యాణ మహోత్సవం

Cancer: ఒక్క క్యాన్సర్ కణం వున్నా కూడా పసిగట్టే టెక్నాలజీ.. అందుబాటులోకి కొత్త బ్లడ్ టెస్ట్

Date : 17 December 2025 08:10 PM Views : 117

Studio18 News - ఆరోగ్యం / : ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను గుర్తించేందుకు యూకేలో కొత్త రక్త పరీక్ష FT-IR మైక్రోస్కోపీతో రక్తంలో క్యాన్సర్ కణాల గుర్తింపు తొలి దశలోనే వ్యాధి నిర్ధారణతో మెరుగైన చికిత్సకు అవకాశం ఇతర క్యాన్సర్ల గుర్తింపునకు కూడా ఈ పద్ధతి ఉపయోగపడే ఛాన్స్ ఊపిరితిత్తుల క్యాన్సర్ నిర్ధారణలో యూకే పరిశోధకులు ఒక విప్లవాత్మక ముందడుగు వేశారు. కేవలం రక్త పరీక్ష ద్వారా క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించే ఒక సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీ క్యాన్స‌ర్ క‌ణాల‌ను ముందుగానే పసిగట్టి, రోగులకు మెరుగైన చికిత్స అందించేందుకు మార్గం సుగమం అవుతుంది. యూనివర్సిటీ హాస్పిటల్స్ ఆఫ్ నార్త్ మిడ్‌లాండ్స్ (UHNM), కీలే, లాఫ్‌బరో యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేపట్టారు. వీరు "ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఇన్‌ఫ్రారెడ్ (FT-IR) మైక్రోస్కోపీ" అనే టెక్నిక్‌ను ఉపయోగించి రక్తంలో ఒక్క క్యాన్సర్ కణం వున్నా కూడా దానిని విజయవంతంగా గుర్తించారు. రక్తంలో తిరుగుతూ ఉండే క్యాన్సర్ కణాలను (సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ - CTCs) ఈ పద్ధతి పసిగడుతుంది. ఈ కణాలు కణితి నుంచి విడిపోయి రక్తంలో ప్రయాణిస్తూ ఇతర భాగాలకు వ్యాధిని వ్యాపింపజేస్తాయి. ఈ టెక్నాలజీలో రక్త నమూనాపై శక్తిమంతమైన ఇన్‌ఫ్రారెడ్ కిరణాలను ప్రసరింపజేస్తారు. క్యాన్సర్ కణాలు ఈ కాంతిని ప్రత్యేకమైన రీతిలో గ్రహిస్తాయి. దీనివల్ల వాటికంటూ ఒక "కెమికల్ ఫింగర్‌ప్రింట్" ఏర్పడుతుంది. కంప్యూటర్ విశ్లేషణ ద్వారా ఈ ఫింగర్‌ప్రింట్‌ను గుర్తించి రక్తంలో క్యాన్సర్ కణాల ఉనికిని నిర్ధారిస్తారు. ప్రస్తుతం ఉన్న పద్ధతులతో పోలిస్తే ఇది చాలా సులభం, వేగవంతమైనది, ఖర్చు కూడా తక్కువ. "ఈ విధానం వల్ల రోగులకు క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడం, వారికి తగ్గట్టుగా చికిత్స అందించడం సాధ్యమవుతుంది. భవిష్యత్తులో ఈ టెక్నిక్‌ను ఊపిరితిత్తుల క్యాన్సర్‌కే కాకుండా ఇతర రకాల క్యాన్సర్ల నిర్ధారణకు కూడా విస్తరించే అవకాశం ఉంది" అని పరిశోధన బృందానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ జోసెప్ సులే-సుసో తెలిపారు. ఈ పరిశోధన వివరాలు "అప్లైడ్ స్పెక్ట్రోస్కోపీ" జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ప్రస్తుతం మరిన్ని క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి, ఈ పరీక్షను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలని పరిశోధకులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :