Friday, 13 March 2026 02:01:20 PM
# ఏల్గొండ గూడ పాఠశాలకు దాత సహాయం # నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి # శ్రీపాద ఎల్లంపల్లి నీరు రుద్రంగికి చేరిక… రైతుల్లో ఆనందం # ఇన్నోవేషన్ పంచాయత్ కార్యక్రమానికి యువత ముందుకు రావాలి: కలెక్టర్ రాజర్షి షా # వేములవాడలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు – 8 మందికి జైలు శిక్ష, 106 మందికి జరిమానాలు # వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి హుండీ ద్వారా రూ.2.16 కోట్ల ఆదాయం # పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # వేములవాడ ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ లేమి – గర్భిణీలకు ఇబ్బందులు # నిర్మల్ జిల్లాలో నారి శక్తి కార్యక్రమం: డయల్-100కు సత్వర స్పందన, అవగాహన కార్యక్రమాలు # పదవ తరగతి విద్యార్థినులకు పెన్నులు, ఎగ్జామ్ ప్యాడ్ల పంపిణీ # జన్నారం మండలంలో నూతన గ్రామ పంచాయతీ భవనాల ప్రారంభం # ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో శిక్షణ ముగింపు కార్యక్రమం # ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి సాధిద్దాం: కలెక్టర్ అభిలాష అభినవ్ # వనస్థలిపురంలో గ్రాండ్ ఇఫ్తార్ పార్టీలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు # ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు శిక్షణ # పీజీ సీట్లు సాధించిన వైద్యులకు బీఆర్ఎస్ నాయకుల ఘన సన్మానం # షాబాద్‌లో మెడికల్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య # పలు వివాహ వేడుకలకు హాజరైన మల్‌రెడ్డి రాంరెడ్డి # బంజారా మహిళ హత్యపై నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ # నూతన వధూవరులను ఆశీర్వదించిన దేప భాస్కర్ రెడ్డి

హెల్దీ లైఫ్ స్టైల్.. అయినా గుండెలో 80 శాతం బ్లాకేజీ.. షాక్‌లో బెంగళూరు టెకీ

Date : 13 May 2025 12:11 PM Views : 272

Studio18 News - ఆరోగ్యం / : బెంగళూరుకు చెందిన 28 ఏళ్ల యువ టెక్ నిపుణుడు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తున్నప్పటికీ గుండెపోటుకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. అతడి గుండె ధమనుల్లో ఏకంగా 80 శాతం మూసుకుపోయినట్టు వైద్యులు గుర్తించారు. కోవిడ్ వ్యాక్సిన్ ఈ పరిస్థితికి కారణమై ఉండవచ్చని కొందరు వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులోని ఓ ప్రముఖ టెక్ సంస్థలో డేటా సైంటిస్టుగా పనిచేస్తున్న సదరు యువకుడు ఉద్యోగం విషయంలో తనకు ఎలాంటి ఒత్తిడి లేదని, ఇంటి నుంచే పనిచేసే అవకాశం ఉండటంతో రోజుకు కేవలం నాలుగు గంటలు మాత్రమే విధులకు కేటాయించేవాడినని తెలిపాడు. మిగిలిన సమయాన్ని ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడానికి, శారీరకంగా చురుగ్గా ఉండటానికి ఉపయోగించుకునేవాడినని పేర్కొన్నాడు. క్రమం తప్పకుండా వ్యాయామశాలకు వెళ్లడం, అప్పుడప్పుడు హైకింగ్‌కు వెళ్లడం వంటివి అతని దినచర్యలో భాగం. మద్యం, పొగతాగడం వంటి ఎలాంటి దురలవాట్లు లేవని, ఆహారపు అలవాట్ల విషయంలోనూ నియంత్రణ పాటిస్తానని వివరించాడు. ఒక రోజు ఛాతీలో అసౌకర్యంగా అనిపించినా పెద్దగా పట్టించుకోలేదు. అయినప్పటికీ, ముందు జాగ్రత్తగా వైట్‌ఫీల్డ్‌లోని ఓ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నాడు. అక్కడ వైద్యులు అతడికి తేలికపాటి గుండెపోటు వచ్చినట్లు నిర్ధారించడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. తాను యుక్తవయసులో ఉండటం, ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉండటం, కుటుంబంలో ఎవరికీ గుండె జబ్బులు లేదా మధుమేహం వంటి చరిత్ర లేకపోవడంతో ఆ నిర్ధారణను నమ్మలేకపోయాడు. ఆసుపత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగి అక్కడి నుంచి వచ్చేశాడు. అనంతరం ఆస్టర్‌లోని మరో ఆసుపత్రికి వెళ్లగా అక్కడి వైద్యులు కూడా గుండెపోటును ధ్రువీకరించారు. అతడి గుండె ధమనుల్లో 80 శాతం బ్లాక్ అయ్యాయని తెలిపారు. చికిత్స అందించకపోతే తీవ్ర ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని చెప్పి శస్త్రచికిత్స నిర్వహించి స్టెంట్ అమర్చారు. ఎలాంటి అనారోగ్యకరమైన అలవాట్లు లేనప్పటికీ తనకీ పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆ యువ టెకీ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వైరస్ శరీరంలో చురుకుగా ఉన్న సమయంలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుని ఉండటం వల్ల రక్తం గడ్డకట్టి ఈ సమస్య తలెత్తి ఉండవచ్చని కొందరు వైద్యులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ అనుభవం నేపథ్యంలో యువత తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశాడు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :