Friday, 13 March 2026 01:55:27 PM
# ఏల్గొండ గూడ పాఠశాలకు దాత సహాయం # నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి # శ్రీపాద ఎల్లంపల్లి నీరు రుద్రంగికి చేరిక… రైతుల్లో ఆనందం # ఇన్నోవేషన్ పంచాయత్ కార్యక్రమానికి యువత ముందుకు రావాలి: కలెక్టర్ రాజర్షి షా # వేములవాడలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు – 8 మందికి జైలు శిక్ష, 106 మందికి జరిమానాలు # వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి హుండీ ద్వారా రూ.2.16 కోట్ల ఆదాయం # పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # వేములవాడ ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ లేమి – గర్భిణీలకు ఇబ్బందులు # నిర్మల్ జిల్లాలో నారి శక్తి కార్యక్రమం: డయల్-100కు సత్వర స్పందన, అవగాహన కార్యక్రమాలు # పదవ తరగతి విద్యార్థినులకు పెన్నులు, ఎగ్జామ్ ప్యాడ్ల పంపిణీ # జన్నారం మండలంలో నూతన గ్రామ పంచాయతీ భవనాల ప్రారంభం # ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో శిక్షణ ముగింపు కార్యక్రమం # ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి సాధిద్దాం: కలెక్టర్ అభిలాష అభినవ్ # వనస్థలిపురంలో గ్రాండ్ ఇఫ్తార్ పార్టీలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు # ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు శిక్షణ # పీజీ సీట్లు సాధించిన వైద్యులకు బీఆర్ఎస్ నాయకుల ఘన సన్మానం # షాబాద్‌లో మెడికల్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య # పలు వివాహ వేడుకలకు హాజరైన మల్‌రెడ్డి రాంరెడ్డి # బంజారా మహిళ హత్యపై నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ # నూతన వధూవరులను ఆశీర్వదించిన దేప భాస్కర్ రెడ్డి

గొంతు నొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన మహిళకు కలలో కూడా ఊహించని షాక్

గర్భవతి అని నిర్ధారించిన వైద్యులు గర్భంలో నాలుగు పిండాలు వృద్ధి చెందుతున్నట్టు వెల్లడి అమెరికాలోని ఇల్లినాయిస్‌కు చెందిన యువతికి షాక్

Date : 18 November 2024 11:34 AM Views : 263

Studio18 News - ఆరోగ్యం / : నర్సింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓ 20 ఏళ్ల యువతి గొంతు నొప్పిగా ఉండడంతో చికిత్స కోసం హాస్పిటల్‌కు వెళ్లింది. సమస్య ఏమిటో తెలుసుకునేందుకు ఎక్స్-రే తీయించుకొని రావాలని వైద్యులు సూచించారు. అయితే ఒకవేళ గర్భవతి అయ్యుంటే రేడియేషన్ ప్రభావం పడుతుందేమోనన్న ఆందోళనతో ముందుగా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవాలని సలహా ఇచ్చారు. దీంతో టెస్ట్ చేయించుకున్న యువతికి జీవితమే మారిపోయే విషయం తెలిసిందే. ఆమె గర్భవతి అని నిర్ధారణ అయింది. హ్యూమన్ కోరియోనిక్ గోనడోట్రోపిన్ (హెచ్‌సీజీ) స్థాయులను బట్టి ఆమె గర్భంలో ఏకంగా నాలుగు పిండాలు ఏర్పడ్డాయని వైద్యులు నిర్ధారించారు. అమెరికాలోని ఇల్లినాయిస్‌కు చెందిన 20 ఏళ్ల కాటెలిన్ యేట్స్ అనే యువతికి ఈ షాకింగ్ అనుభవం ఎదురైంది. యేట్స్ ఈ ఏడాది ఏప్రిల్ 1న హాస్పిటల్‌కు వెళ్లింది. దీంతో ‘ఏప్రిల్ ఫూల్’ సందర్భంగా వైద్యులు ఆట పట్టిస్తున్నారేమోనని ఆమె భావించింది. జోక్ అని భావించి నమ్మలేదు. కానీ ఆ తర్వాత వాస్తవాన్ని అర్థం చేసుకుంది. ఇక ఆమెకు కాబోయే భర్త జూలియన్ బ్యూకర్ ఈ వార్త విని చాలా సంతోషించాడు. కాబోయే వాడి నుంచి ఎలాంటి అభ్యంతరం లేకపోవడంతో ఆమె కూడా సంతోషించింది. కాగా గర్భం పెరుగుదల సమయంలో యేట్స్ పలు సమస్యలు ఎదుర్కొంది. ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటూ జాగ్రత్తలు తీసుకుంది. గర్భం 20 వారాలు దాటిన తర్వాత ఆమె హైబీపీ లాంటి పరిస్థితిని ఎదుర్కొంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. అంతేకాదు కాలేయ సమస్యలు, మూత్రపిండాల సమస్యలు కూడా వచ్చాయి. అయినప్పటికీ వీటన్నింటిని ఆమె భరించింది. సరిగ్గా 28 వారాల 4 రోజులలో ఇల్లినాయిస్‌లోని స్ప్రింగ్‌ఫీల్డ్‌లోని హెచ్‌ఎస్‌హెచ్‌ఎస్ సెయింట్ జాన్స్ హాస్పిటల్‌లో చేరారు. అక్టోబరు 17న నలుగురు బిడ్డలను ఆమె ప్రసవించింది. చివరిగా పుట్టిన చిన్నపాప (ఎలిజబెత్) అత్యల్పంగా 1 పౌండ్, 2 ఔన్సుల బరువు ఉంది. అత్యధికంగా మాక్స్(పిల్లాడు) 2 పౌండ్ల 6 ఔన్సుల బరువు ఉన్నాడు. ప్రస్తుతం నలుగురు శిశువులూ క్రమంగా బరువు పెరుగుతూ ఆరోగ్యంగా ఉన్నారు. అసాధారణ రీతిలో ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు జన్మనిచ్చిన ఆమె ఇటీవల ఓ మీడియాతో సంస్థతో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. గర్భవతిననే విషయం ఎలా తెలిసింది, గర్భం సమయంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నదీ ఆమె వివరించారు. కాగా ‘జర్నల్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్’ రిపోర్ట్ ప్రకారం.. గర్భంలో ఒకేసారి నాలుగు పిండాలు ఏర్పడడం 500,000 ప్రెగ్నెన్సీల్లో ఒకసారి జరుగుతుంది.

Also Read : ఒక వ్యక్తి నన్ను సినిమాలు చేయొద్దని చెప్పాడు: నయనతార

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :