Friday, 13 March 2026 02:01:16 PM
# ఏల్గొండ గూడ పాఠశాలకు దాత సహాయం # నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి # శ్రీపాద ఎల్లంపల్లి నీరు రుద్రంగికి చేరిక… రైతుల్లో ఆనందం # ఇన్నోవేషన్ పంచాయత్ కార్యక్రమానికి యువత ముందుకు రావాలి: కలెక్టర్ రాజర్షి షా # వేములవాడలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు – 8 మందికి జైలు శిక్ష, 106 మందికి జరిమానాలు # వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి హుండీ ద్వారా రూ.2.16 కోట్ల ఆదాయం # పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # వేములవాడ ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ లేమి – గర్భిణీలకు ఇబ్బందులు # నిర్మల్ జిల్లాలో నారి శక్తి కార్యక్రమం: డయల్-100కు సత్వర స్పందన, అవగాహన కార్యక్రమాలు # పదవ తరగతి విద్యార్థినులకు పెన్నులు, ఎగ్జామ్ ప్యాడ్ల పంపిణీ # జన్నారం మండలంలో నూతన గ్రామ పంచాయతీ భవనాల ప్రారంభం # ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో శిక్షణ ముగింపు కార్యక్రమం # ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి సాధిద్దాం: కలెక్టర్ అభిలాష అభినవ్ # వనస్థలిపురంలో గ్రాండ్ ఇఫ్తార్ పార్టీలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు # ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు శిక్షణ # పీజీ సీట్లు సాధించిన వైద్యులకు బీఆర్ఎస్ నాయకుల ఘన సన్మానం # షాబాద్‌లో మెడికల్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య # పలు వివాహ వేడుకలకు హాజరైన మల్‌రెడ్డి రాంరెడ్డి # బంజారా మహిళ హత్యపై నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ # నూతన వధూవరులను ఆశీర్వదించిన దేప భాస్కర్ రెడ్డి

పొద్దున్నే గోరువెచ్చని నీళ్లు తాగితే.. ఇన్ని ప్రయోజనాలా?

జీర్ణ వ్యవస్థ మొదలు చర్మ సౌందర్యం దాకా లాభాలు ఎనిమిది రకాల ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయన్న నిపుణులు పరిమితికి మించి వేడి నీటిని తీసుకోవద్దనే సూచనలు

Date : 11 November 2024 11:55 AM Views : 318

Studio18 News - ఆరోగ్యం / : రోజూ ఉదయం పరగడుపునే ఒక గ్లాసుడు గోరువెచ్చని నీళ్లు తాగితే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. జీర్ణ వ్యవస్థ మొదలుకుని మొత్తంగా శరీర ఆరోగ్యానికి ఇది దోహదపడుతుందని వివరిస్తున్నారు. ముఖ్యంగా ఉదయమే గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల ఎనిమిది ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. 1. జీర్ణ వ్యవస్థ బలోపేతం పొద్దున్నే గోరు వెచ్చని నీళ్లు తాగితే జీర్ణ వ్యవస్థ ఉత్తేజితం అవుతుంది. జీర్ణాశయంలో మిగిలిపోయిన ఆహారం ఏదైనా ఉంటే.. త్వరగా జీర్ణమై కడుపు ఖాళీ అవుతుంది. తర్వాత ఆహారం తీసుకున్నప్పుడు బాగా అరగడానికి ఇది తోడ్పడుతుంది. ముఖ్యంగా అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నవారికి ఇది చాలా మేలు చేస్తుంది. 2. విష పదార్థాలను తొలగిస్తుంది.. శరీరంలో జీవక్రియల్లో భాగంగా పలు వ్యర్థ, విషపూరిత పదార్థాలు ఉత్పన్నం అవుతాయి. ఉదయమే గోరువెచ్చని నీళ్లు తాగడం ద్వారా ఆ వ్యర్థ, విషపూరిత పదార్థాలు శరీరం నుంచి మూత్రం, చెమట, ఇతర రూపాల్లో బయటికి వెళ్లిపోతాయి. శరీరం పునరుత్తేజితం అవుతుంది. 3. రక్తం సరఫరా మెరుగవుతుంది.. వెచ్చని నీళ్లు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. రక్తంలో నీటి శాతం పెరుగుతుంది. వీటితో రక్త నాళాలు వ్యాకోచించి.. శరీర కణాలకు ఆక్సిజన్‌, గ్లూకోజ్‌ సరఫరా మెరుగవుతుంది. అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. 4. నాసికా ద్వారాలు శుభ్రమవుతాయి గోరు వెచ్చని నీళ్లు తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి, శ్వాస ద్వారా వెళ్లే నీటి ఆవిరి కూడా వేడెక్కుతుంది. ఇది శ్వాస వ్యవస్థలో నాళాలను శుభ్రపరుస్తుంది. ముఖ్యంగా చలికాలంలో, అలర్జీలతో బాధపడే సమయంలో ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. 5. గొంతులో గరగర, ఇతర ఇబ్బందులు తగ్గుతాయి రాత్రి నిద్ర సమయంలో గొంతులో శ్లేష్మం చేరుతుంది. నోటిలోని కొన్ని భాగాలు తడారిపోతాయి. జలుబు, దగ్గు వంటివి వచ్చినప్పుడూ ఇలాంటి ఇబ్బందులే ఉంటాయి. అయితే ఉదయమే గోరు వెచ్చని నీళ్లు తాగడం వల్ల.. గొంతులో ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 6. బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.. ఉదయమే గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల శరీరంలో జీవక్రియల (మెటబాలిజం) వేగం పెరుగుతుంది. దీనితో శరీరంలో శక్తి ఎక్కువగా ఖర్చవుతుంది. అదే సమయంలో ఆకలి కూడా నియంత్రణలో ఉంటుంది. ఇవి బరువు తగ్గేందుకు తోడ్పడుతాయి. 7. చర్మానికి మంచి మెరుపును ఇస్తుంది చర్మ ఆరోగ్యం కోసం తగినంత మేర నీళ్లు శరీరానికి అందాల్సిందే. అంతేకాదు.. మన శరీరంలో ఉత్పత్తయ్యే వ్యర్థ, విష పదార్థాలతో చర్మం కళావిహీనం అవుతుంది. గోరు వెచ్చని నీళ్లు తాగడం వల్ల ఈ రెండింటికీ పరిష్కారంతోపాటు చర్మం ముడతలు పడటం తగ్గుతుంది. 8. మానసిక ఒత్తిడి తగ్గి, విశ్రాంతినిస్తుంది.. గోరువెచ్చని నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ‘కార్టిసాల్‌’ హార్మోన్‌ ఉత్పత్తి తగ్గి... మన కేంద్ర నాడీ వ్యవస్థ ప్రశాంతమవుతుంది. మానసిక ఒత్తిడి నియంత్రణలోకి వచ్చి.. విశ్రాంతి అందిన భావన నెలకొంటుంది. ఈ జాగ్రత్తలు తప్పనిసరి గోరు వెచ్చని నీటితో లాభాలు ఉన్నాయి కదా అని అజాగ్రత్తగా ఉండవద్దని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. పరిమితికి మించి వేడి నీటిని తాగితే.. నోరు, ఆహార నాళం, లోపలి అవయవాలపై ప్రభావం పడే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. వేర్వేరు వ్యక్తుల శరీర తత్వాన్ని బట్టి.. తగిన స్థాయిలో గోరు వెచ్చగా ఉండే నీటిని తీసుకోవాలని సూచిస్తున్నారు.

Also Read : నిన్న అజిత్.. నేడు కమల హాసన్.. వెంటనే ఆ ట్యాగ్ తొలగించాలని విన్నపం

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :