
- ఎన్నికల తర్వాత చంద్రబాబు, లోకేశ్ కి భవిష్యత్తు ఉండదన్న విజయసాయి
- బీసీలకు జగన్ పెద్దపీట వేశారని వెల్లడి
- మరో 25 ఏళ్లు జగనే సీఎం అంటూ వ్యాఖ్య

టీడీపీ అధినేత చంద్రబాబు కేవలం ఆయన కులం, కుటుంబం కోసమే పని చేశారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని… ఎన్నికల తర్వాత చంద్రబాబుకు, ఆయన కుమారుడు లోకేశ్ కి భవిష్యత్తు ఉండదని చెప్పారు. జగన్ ప్రజల కోసం పని చేస్తున్నారని… మరో 25 ఏళ్లు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారని అన్నారు.
Follow us on Social Media
బీసీలకు జగన్ పెద్ద పీట వేశారని విజయసాయి చెప్పారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లను కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ నెల 7న విజయవాడలో జయహో బీసీ సభను వైసీపీ నిర్వహించబోతోంది. ఈ సభకు సంబంధించిన పోస్టర్ ను ఆ పార్టీ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మంత్రి జోగి రమేశ్ మాట్లాడుతూ… బీసీ పదాన్ని ఉచ్చరించే అర్హత కూడా చంద్రబాబుకు లేదని అన్నారు.