Sunday, 15 March 2026 01:55:27 PM
# షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్ # హోన్నజీపేటలో ఎస్సీ/ఎస్టీ కేసు విచారణ… గ్రామాన్ని సందర్శించిన ఏసీపీ బి. ప్రకాష్ # వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ వ్యాక్సిన్, నర్సరీ మొక్కల పరిశీలన # ఈ రోజు బిపూర్ణోదయ స్కూల్ వార్షికోత్సవంలో మొద్దు లచ్చి రెడ్డి పాల్గొన్నారు # పకడ్బందీగా పదో తరగతి పరీక్షల నిర్వహణ # మండుటెండలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర… తేనెటీగల కలకలం # పరీక్షా కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత # మందమర్రి పోలీస్ స్టేషన్‌లో పరిశుభ్రత కార్యక్రమం # జిల్లా జైల్లో ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహణ # జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు – 34 కేంద్రాల్లో ఏర్పాట్లు # జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ రాజర్షి షా

Shruti Haasan: కాలేజీ రోజులు గుర్తుచేసుకున్న శృతి హాసన్... వీడియో ఇదిగో!

Date : 19 January 2026 06:52 PM Views : 42

Studio18 News - లైఫ్ స్టయిల్ / : తాను చదువుకున్న కాలేజీ వీధిలో తిరుగుతూ పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిన శ్రుతి హాసన్ ఒకప్పుడు ఇష్టంగా తిన్న మటన్ రోల్ దొరక్కపోవడంతో నిరాశ జుట్టుకు పింక్ రంగు వేసుకున్నందుకు ప్రిన్సిపాల్ పిలిచారని వెల్లడి గాయనిగా మారాలనే ఆసక్తి కాలేజీలోనే మొదలైందని వెల్లడి త్వరలో 'సలార్ పార్ట్ 2'లో కనిపించనున్న నటి స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ తన పాత జ్ఞాపకాల్లోకి వెళ్లారు. తాను చదువుకున్న కాలేజీ రోజులను గుర్తుచేసుకుంటూ, చాలా సంవత్సరాల తర్వాత ముంబైలోని తన కళాశాల వీధిలో కలియదిరిగారు. ఈ సందర్భంగా తీసిన ఓ వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. "చాలా ఏళ్ల తర్వాత మళ్లీ నా కాలేజీ వీధికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. నేను ప్రతిరోజూ ఇక్కడే నడిచేదాన్ని" అని చెబుతూ శ్రుతి తన వీడియోను ప్రారంభించారు. కాలేజీ తర్వాత స్నేహితులతో కలిసి స్నాక్స్ తినేందుకు వెళ్లే ప్రదేశాన్ని చూపిస్తూ, అప్పుడప్పుడు అక్కడికి వెళ్లే వాళ్లం... రోజూ అక్కడికి వెళితే మాత్రం డబ్బులు మిగిలేవి కాదు అని సరదాగా వ్యాఖ్యానించారు. అనంతరం, ఒకప్పుడు ఎంతో ఇష్టంగా తిన్న మటన్ రోల్ కోసం ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. కానీ, ఇప్పుడు అక్కడ అది అందుబాటులో లేదని తెలిసి నిరాశ చెందారు. "రోల్‌కు ఏమైంది? జీవితంలో కొన్ని విషయాలు మారిపోతాయి" అని అన్నారు. కాలేజీ రోజుల్లో తాను జుట్టుకు పింక్ రంగు వేసుకున్నందుకు ప్రిన్సిపాల్ తనను ఆఫీసుకు పిలిపించారని ఓ సరదా సంఘటనను గుర్తుచేసుకున్నారు. గాయనిగా మారాలనే తన ఆసక్తి కూడా కాలేజీలోనే మొదలైందని శ్రుతి వెల్లడించారు. "చాలా నాస్టాల్జిక్‌గా ఫీల్ అవుతున్నాను. ఇన్నేళ్లయినా ఇక్కడ ఏమీ మారలేదు" అని తెలిపారు. ఈ వీడియోకు "జ్ఞాపకాల దారిలో ఒక ప్రయాణం" అని క్యాప్షన్ జోడించారు. ఇక శ్రుతి హాసన్ కెరీర్ విషయానికొస్తే, ఆమె త్వరలో "సలార్ పార్ట్ 2: శౌర్యాంగ పర్వం" చిత్రంలో కనిపించనున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన "సలార్: పార్ట్ 1" భారీ విజయం సాధించడంతో సీక్వెల్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :