Saturday, 14 December 2024 04:15:48 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Vamsi: భానుప్రియకి విపరీతమైన జ్వరం .. అప్పుడు చేసిన ఆ సాంగ్ సూపర్ హిట్: వంశీ

Date : 24 August 2024 04:48 PM Views : 83

Studio18 News - లైఫ్ స్టయిల్ / : వంశీ దర్శకత్వంలో రూపొందిన చెప్పుకోదగిన సినిమాలలో 'ప్రేమించు పెళ్లాడు' ఒకటి. రాజేంద్ర ప్రసాద్ - భానుప్రియ కాంబినేషన్లో నిర్మితమైన ఈ సినిమా, ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను గురించిన వీడియోను తాజాగా వంశీ రిలీజ్ చేశారు. వంశీ మాట్లాడుతూ .. "కొవ్వూరు దగ్గర గోదావరిలో 'వయ్యారి గోదారమ్మా ఒళ్లంతా ఎందుకమ్మా కలవరం' అనే పాటను చిత్రీకరించాలనుకున్నాము. అందుకు కావలసిన సన్నాహాలు జరుగుతున్నాయి. చెట్టు కొమ్మల మధ్యలో భానుప్రియ ఉంటుంది. చెట్టు క్రింద ఉన్న గ్రూప్ డాన్సర్ల మధ్యలోకి ఆమె దూకాలి. తెరపై అది స్లో మోషన్ లో ఉంటుందన్నమాట. అది స్లో మోషన్ షాట్ అని ఆమెకి చెప్పలేదు. చెబితే ఆర్టిస్టులు ఆర్టిఫిషియల్ గా ప్రిపేరవుతూ ఉంటారని చెప్పలేదు" అన్నారు. " ఆ పాటలో భానుప్రియ చెట్టు పై నుంచి దూకారు. ఆ తరువాత లొకేషన్ షిఫ్టింగ్ ఉంది. ఆ సమయంలోనే నాకు తెలిసింది .. భానుప్రియ జ్వరంతో బాధపడుతున్నారనీ, అసలు ఆమె షూటింగును వచ్చే పరిస్థితి కాకపోయినా వచ్చారని. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అయితే తన గురించి షాట్స్ మార్చుకోవద్దనీ, తాను చేస్తానని భానుప్రియ కబురు చేశారు. అంత జ్వరంలో ఆమె చేసిన ఆ పాట సూపర్ హిట్ అయింది " అని చెప్పారు. "ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను 'దోసకాయలపల్లిలో' ప్లాన్ చేశాము. భానుప్రియ కట్టుకోవలసిన చీరను సెలెక్ట్ చేశాను. అదే సమయంలో భానుప్రియ వాళ్లమ్మగారు వచ్చి పెద్ద బొట్టు చూపించి, ఇది ఆమెకి పెడితే బాగుంటుందా అని నన్ను అడిగారు .. సరే పెట్టండి అన్నాను. అంతే ఆ రోజు నుంచి భానుప్రియకి అదే 'పెద్ద బొట్టు' కంటిన్యూ అయింది. ఆ తరువాత సినిమాలలో కొంతమంది హీరోయిన్స్ కి పెద్దబొట్టు పెట్టి, తప్పు చేశానని అనిపించుకున్నాను" అని చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :