Friday, 14 February 2025 08:13:19 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

Teachers Day 2024: సెప్టెంబర్ 5న ‘టీచర్స్ డే’ను ఎందుకు జరుపుకుంటామో తెలుసా?

Date : 05 September 2024 11:11 AM Views : 143

Studio18 News - లైఫ్ స్టయిల్ / : గురువు ప్రతి ఒక్కరి జీవితంలో అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలి విజ్ఞానమనే వెలుగులు పూయిస్తాడు. శిష్యుడిలో నైపుణ్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించి విజయానికి సరైన మార్గాన్ని చూపిస్తాడు. అలాంటి గురువుని జీవితాంతం గుర్తు పెట్టుకోవడం, వారికి కృతజ్ఞతలు చెప్పడం మన కర్తవ్యం. ఏటా సెప్టెంబర్ 5 ‘ఉపాధ్యాయ దినోత్సవం’ అందరికీ ఆ అవకాశాన్ని ఇస్తుంది. సెప్టెంబర్ 5 న ప్రత్యేకంగా ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం అంటే చదవండి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవంగా సెప్టెంబర్ 5న జరుపుకుంటారు. ఆయన గొప్ప పండితులు, భారతరత్న గ్రహీత, దేశ మొదటి ఉప రాష్ట్రపతి, స్వతంత్ర భారతదేశానికి రెండవ రాష్ట్రపతి. 1888, సెప్టెంబర్ 5న ఆయన జన్మించారు. ఆయన గొప్ప విద్యావేత్త, న్యాయవాది అన్నింటికంటే గొప్ప ఉపాధ్యాయుడు. మొదటి ఉపాధ్యాయ దినోత్సవాన్ని 1962, సెప్టెంబర్ 5న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం రోజు జరుపుకున్నారు. అప్పటి నుంచి ఏటా నిర్వహిస్తూ వస్తున్నారు. ఇలా జరుపుకోవడం వెనుక కారణం ఉంది. డాక్టర్ రాధాకృష్ణన్ 1962లో భారత రాష్ట్రపతి అయ్యారు. సెప్టెంబర్ 5 న ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు అనుమతి ఇవ్వమని ఆయన సన్నిహితులు, విద్యార్ధులు సంప్రదించారట. అప్పుడు ఆయన నా పుట్టినరోజుని జరపడం కంటే సెప్టెంబర్ 5 న ఉపాధ్యాయ దినోత్సవంగా జరిపితే అది నాకు గర్వకారణం అన్నారట.’ ఆయన అభ్యర్ధనతో భారతదేశం సెప్టెంబర్ 5 న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటోంది. ఉపాధ్యాయులు ఏది మంచి ఏది చెడు బోధిస్తారు. విద్యార్ధులను భవిష్యత్ నాయకులుగా తీర్చి దిద్దుతారు. ఈ క్రమంలో వారికి ఎదురయ్యే సవాళ్లు, కష్టాలు, సమాజంలోని వారి ప్రత్యేక పాత్రను గుర్తించడానికి ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. ఈరోజున దేశ వ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్ధులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. తమ గురువులను సత్కరించుకుంటారు. ఈరోజున ప్రతిభావంతులైన ఉపాధ్యాయులకు భారత రాష్ట్రపతి అవార్డులు ప్రదానం చేస్తారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :