Friday, 13 March 2026 04:58:46 AM
# శ్రీపాద ఎల్లంపల్లి నీరు రుద్రంగికి చేరిక… రైతుల్లో ఆనందం # ఇన్నోవేషన్ పంచాయత్ కార్యక్రమానికి యువత ముందుకు రావాలి: కలెక్టర్ రాజర్షి షా # వేములవాడలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు – 8 మందికి జైలు శిక్ష, 106 మందికి జరిమానాలు # వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి హుండీ ద్వారా రూ.2.16 కోట్ల ఆదాయం # పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # వేములవాడ ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ లేమి – గర్భిణీలకు ఇబ్బందులు # నిర్మల్ జిల్లాలో నారి శక్తి కార్యక్రమం: డయల్-100కు సత్వర స్పందన, అవగాహన కార్యక్రమాలు # పదవ తరగతి విద్యార్థినులకు పెన్నులు, ఎగ్జామ్ ప్యాడ్ల పంపిణీ # జన్నారం మండలంలో నూతన గ్రామ పంచాయతీ భవనాల ప్రారంభం # ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో శిక్షణ ముగింపు కార్యక్రమం # ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి సాధిద్దాం: కలెక్టర్ అభిలాష అభినవ్ # వనస్థలిపురంలో గ్రాండ్ ఇఫ్తార్ పార్టీలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు # ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు శిక్షణ # పీజీ సీట్లు సాధించిన వైద్యులకు బీఆర్ఎస్ నాయకుల ఘన సన్మానం # షాబాద్‌లో మెడికల్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య # పలు వివాహ వేడుకలకు హాజరైన మల్‌రెడ్డి రాంరెడ్డి # బంజారా మహిళ హత్యపై నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ # నూతన వధూవరులను ఆశీర్వదించిన దేప భాస్కర్ రెడ్డి # కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ శత జయంతి సభను విజయవంతం చేయాలని పిలుపు # డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు ఆరోపిస్తూ బీజేపీ నాయకుల భిక్షాటన

ఇష్టమని ఊరగాయ పచ్చడి లాగించేస్తున్నారా? ఐతే మీకీ విషయం చెప్పాల్సిందే..

ఊరగాయ పచ్చళ్లు చాలా మందికి మహా ఇష్టం. అందుకే ఎక్కడికి వెళ్లినా ఓ సీసా తమతోపాటు తీసుకెళ్తూ ఉంటారు. అయితే ఇష్టమని వీటిని విపరీతంగా తింటే లేనిపోని ఆరోగ్య

Date : 27 December 2025 08:31 PM Views : 96

Studio18 News - లైఫ్ స్టయిల్ / : కొత్త ఊరగాయ పచ్చడి వాసనకే కడుపు నిండిపోతుంది. వేడి వేడి అన్నంలో ఊరగాయ వేసుకుని.. కాస్తింత నెయ్యి దట్టిస్తే రుచి అదిరిపోవాల్సిందే. అందుకే తెలుగు వారికి ఊరగయా పచ్చల్లకు ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ఇది లేకుండా ఏ శుభకార్యం విందు కూడా పూర్తవదు. అయితే ఊరగాయ అంటే కేవలం ఉప్పు, ఘాటు కారం, మసాలాలు మాత్రమే కాదు. వాటి తయారీ, నిల్వ ప్రక్రియలో అనేక రసాయన మార్పులు జరుగుతాయి. వీటిలో కొన్ని సహజమైనవి, అవసరమైనవి ఉంటే.. మరికొన్ని అనవరసరమైనవి కూడా వచ్చి చేరుతాయి. అందుకే ఊరగాయ పచ్చడి ఇష్టమని రోజూ తింటే ఆరోగ్యానికి హాని తలెత్తుతుందని ఆరోగ్యి నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊరగాయలో ప్రధాన పదార్థం సోడియం క్లోరైడ్ (ఉప్పు). ఇది సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధించడం ద్వారా ఆహారాన్ని నిల్వ చేయడానికి సహాయపడుతుంది. అయితే అధిక ఉప్పు వినియోగం రక్తపోటు, గుండె, మూత్రపిండాల సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. అదేవిధంగా వెనిగర్, సోర్ ద్రావణంలోని ఎసిటిక్ ఆమ్లం, నిమ్మకాయలలోని సిట్రిక్ ఆమ్లం నిల్వకు సహాయపడతాయి. అధిక ఆమ్లత్వం కడుపు చికాకు, ఆమ్ల సమస్యలకు దారితీస్తుంది.

మిరపకాయలకు కారంగా ఉండే కాప్సైసిన్ తక్కువ మొత్తంలో ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ అధికంగా తీసుకుంటే అది గ్యాస్ట్రిటిస్, కడుపు పొరకు హాని కలిగిస్తుంది. ఊరగాయలలో ఉపయోగించే నూనెలోని కొవ్వులు (ట్రైగ్లిజరైడ్లు) అధికంగా ఉంటాయి. వీటిని తీసుకుంటే కొలెస్ట్రాల్, గుండె సమస్యలకు దారితీస్తుంది. చాలా ఊరగాయలను కిణ్వ ప్రక్రియ ద్వారా తయారు చేస్తారు. ఈ ప్రక్రియ లాక్టిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆహారాన్ని నిల్వ చేయడానికి సహాయపడుతుంది. అయితే సరిగ్గా నిల్వ చేయకపోతే ప్రమాదకరమైన విషపూరిత సమ్మేళనాలు కూడా ఏర్పడతాయి. ఇటీవలి వాణిజ్య ఊరగాయలలో తరచుగా కృత్రిమ సంరక్షణకారులు, రంగులు, సోడియం బెంజోయేట్, పొటాషియం సోర్బేట్ వంటి రుచిని పెంచే పదార్ధాలను వాడుతున్నారు. వీటిని దీర్ఘకాలికంగా తీసుకోవడం వల్ల పిల్లలలో అలెర్జీలు, హైపర్యాక్టివిటీ ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. అఫ్లాటాక్సిన్, బోటులినమ్ టాక్సిన్ వంటి విషపదార్థాల వల్ల అతి పెద్ద ప్రమాదం తలెత్తుంది. ఇవి సరిగ్గా నిల్వ చేయకపోవడం వల్ల ఉత్పత్తి అవుతాయి. ఇవి కాలేయానికి హాని కలిగించేంత తీవ్రమైనవి. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం కూడా. అందువల్ల ఊరగాయల పచ్చళ్లను పూర్తిగా నివారించకపోయినా పరిమితం తీసుకోవడం మంచిది

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :