Friday, 13 March 2026 04:57:49 AM
# శ్రీపాద ఎల్లంపల్లి నీరు రుద్రంగికి చేరిక… రైతుల్లో ఆనందం # ఇన్నోవేషన్ పంచాయత్ కార్యక్రమానికి యువత ముందుకు రావాలి: కలెక్టర్ రాజర్షి షా # వేములవాడలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు – 8 మందికి జైలు శిక్ష, 106 మందికి జరిమానాలు # వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి హుండీ ద్వారా రూ.2.16 కోట్ల ఆదాయం # పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # వేములవాడ ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ లేమి – గర్భిణీలకు ఇబ్బందులు # నిర్మల్ జిల్లాలో నారి శక్తి కార్యక్రమం: డయల్-100కు సత్వర స్పందన, అవగాహన కార్యక్రమాలు # పదవ తరగతి విద్యార్థినులకు పెన్నులు, ఎగ్జామ్ ప్యాడ్ల పంపిణీ # జన్నారం మండలంలో నూతన గ్రామ పంచాయతీ భవనాల ప్రారంభం # ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో శిక్షణ ముగింపు కార్యక్రమం # ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి సాధిద్దాం: కలెక్టర్ అభిలాష అభినవ్ # వనస్థలిపురంలో గ్రాండ్ ఇఫ్తార్ పార్టీలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు # ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు శిక్షణ # పీజీ సీట్లు సాధించిన వైద్యులకు బీఆర్ఎస్ నాయకుల ఘన సన్మానం # షాబాద్‌లో మెడికల్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య # పలు వివాహ వేడుకలకు హాజరైన మల్‌రెడ్డి రాంరెడ్డి # బంజారా మహిళ హత్యపై నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ # నూతన వధూవరులను ఆశీర్వదించిన దేప భాస్కర్ రెడ్డి # కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ శత జయంతి సభను విజయవంతం చేయాలని పిలుపు # డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు ఆరోపిస్తూ బీజేపీ నాయకుల భిక్షాటన

Cooking Oils | వంట నూనెల‌ను ప‌దే ప‌దే వేడి చేసి మ‌రీ ఉప‌యోగిస్తున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!

వంట‌లు చేయ‌డానికి సాధార‌ణంగా మ‌నం వాడే ప‌దార్థాల్లో నూనె కూడా ఒక‌టి. భార‌తీయ వంట‌కాల్లో ఇది ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. ప‌ప్పు, ప‌చ్చ‌డి, పులుసు, కూర ఎ

Date : 26 December 2025 06:25 PM Views : 74

Studio18 News - లైఫ్ స్టయిల్ / : Cooking Oils | వంట‌లు చేయ‌డానికి సాధార‌ణంగా మ‌నం వాడే ప‌దార్థాల్లో నూనె కూడా ఒక‌టి. భార‌తీయ వంట‌కాల్లో ఇది ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. ప‌ప్పు, ప‌చ్చ‌డి, పులుసు, కూర ఎలా ఏ వంట‌కాలు చేసినా మ‌నం నూనెను ఉప‌యోగిస్తూ ఉంటాం. అలాగే మ‌నం తినే చాలా ర‌కాల చిరుతిండ్లు నూనెలో వేయించిన‌వే. ఇక కొన్ని వంట‌కాల‌ను డీప్ ఫ్రై చేస్తూ ఉంటాము. అలాగే వివిధ ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా నూనెలో వేసి వేయించి తింటూ ఉంటాం. వంట‌కాలు పూర్తి అయిన త‌రువాత ఈ డీప్ ఫ్రైకు వాడిన నూనెను చాలా మంది నిల్వ చేసుకుని మ‌ర‌లా ఉప‌యోగిస్తూ ఉంటారు. ఈ విధంగా మ‌న‌లో చాలా మంది చేస్తూ ఉంటారు. అయిన వాడిన నూనెను తిరిగి వాడ‌డం మంచిది కాద‌ని వైద్యులు చెబుతున్నారు. భార‌త‌దేశంలో దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య పెరుగుతోంది. క‌నుక నూనెను తిరిగి వాడ‌డం మంచిది కాద‌ని హెచ్చ‌రిస్తున్నారు. అనేక రోగాల‌కు కార‌ణం.. నూనెను ప‌దే ప‌దే వేడి చేయ‌డం వ‌ల్ల వాటిలో విష ప‌దార్థాలు ఏర్ప‌డ‌తాయి. ఇవి శ‌రీరంపై తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తాయ‌ని తీవ్ర‌మైన దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డేలా చేస్తాయని వారు తెలియ‌జేస్తున్నారు. భార‌తీయుల ఇండ్ల‌ల్లో నూనెను మ‌ర‌లా మ‌ర‌లా వాడ‌డం మ‌నం చూస్తూనే ఉంటాం. ఇలా చేయ‌డం వ‌ల్ల కొవ్వు ఆమ్లాలు విచ్చ‌న‌మై ఫ్రీరాడిక‌ల్స్ ను విడుద‌ల చేస్తాయి. నూనెను ఎంత ఎక్కువ‌గా వేడి చేస్తే ఫ్రీరాడికల్స్ అంత ఎక్కువ‌గా విడుద‌ల అవుతాయి. ఫ్రీరాడిక‌ల్స్ శ‌రీరం పై తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తాయి. ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ ను పెంచ‌డంలో, ట్రైగ్లిజ‌రైడ్స్ ను పెంచ‌డంలో, ఆక్సీక‌ర‌ణ ఒత్తిడిని పెంచ‌డంలో, వాపుల‌ను ప్రేరేపించ‌డంలో, ఇన్సులిన్ నిరోధ‌క‌త‌ను పెంచ‌డంలో ఫ్రీరాడిక‌ల్స్ పాత్ర ఎంతో ఉంది. కాల‌క్ర‌మేణా ఇది గుండె జ‌బ్బులు, డ‌యాబెటిస్, ఫ్యాటీ లివ‌ర్, క్యాన్స‌ర్ వంటి వ్యాధుల‌కు దారి తీస్తుంది. ఈ త‌ప్పు చేయ‌వ‌ద్దు.. అలాగే కొంద‌రు వాడిన నూనెను నిల్వ చేయ‌డంలో కూడా త‌ప్పులు చేస్తూ ఉంటారు. వాడిన నూనెపై మూత ను స‌రిగ్గా ఉంచ‌రు. దీని వ‌ల్ల ఆక్సీక‌ర‌ణం త్వ‌ర‌గా జ‌రిగి ఫ్రీరాడిక‌ల్స్ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతాయి. క‌నుక వాడిన నూనెను మూత ఉంచిన డ‌బ్బాలో పోసి చ‌ల్ల‌టి, చీక‌టి ప్ర‌దేశాల్లో ఉంచి మాత్ర‌మే నిల్వ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఆక్సీక‌ర‌ణ త‌గ్గుతుంది. ఫ్రీరాడికల్స్ ఉత్ప‌త్తి త‌గ్గుతుంది. ఇక వాడిన నూనెను మ‌ర‌లా వాడాలి అనుకునే వారు దీనిని తాజా నూనెతో క‌లిపి వాడ‌డం మంచిది. ఇలా చేయ‌డం వ‌ల్ల నూనె ఎక్కువ‌గా విష‌పూరితం అవ్వ‌దు. కానీ దానిలో ఉండే హానికార‌క స‌మ్మేళ‌నాలు త‌గ్గ‌వు. నూనెను మ‌ర‌లా వాడ‌డం వ‌ల్ల దానిలో ఉండే పోష‌కాలు కూడా త‌గ్గుతాయి. వీటిని వాడితే మంచిది.. పొట్ట‌, గుండెతో పాటు శ‌రీర ఆరోగ్యానికి కూడా తీవ్ర హాని క‌లుగుతుంద‌ని వైద్యులు తెలియ‌జేస్తున్నారు. క‌నుక వాడిన నూనెను మ‌ర‌లా వాడ‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని వారు స‌ల‌హా ఇస్తున్నారు. అలాగే చాలా మంది వంట‌ల్లో పొద్దుతిరుగుడు నూనెను వాడుతూ ఉంటారు. దీనికి బ‌దులుగా ప‌ల్లి నూనె, ఆవాల నూనె, కొబ్బ‌రి నూనె, నెయ్యి వంటి వాటిని ఉప‌యోగించ‌డం మంచిద‌ని అలాగే నెల‌కొక‌సారి తీసుకునే నూనెల‌ను మార్చాల‌ని వారు చెబుతున్నారు. ఏదో ఒకే ర‌క‌మైన నూనెపై అతిగా ఆధార‌ప‌డ‌డం కూడా మంచిది కాద‌ని వారు సూచిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :