Friday, 13 March 2026 04:58:47 AM
# శ్రీపాద ఎల్లంపల్లి నీరు రుద్రంగికి చేరిక… రైతుల్లో ఆనందం # ఇన్నోవేషన్ పంచాయత్ కార్యక్రమానికి యువత ముందుకు రావాలి: కలెక్టర్ రాజర్షి షా # వేములవాడలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు – 8 మందికి జైలు శిక్ష, 106 మందికి జరిమానాలు # వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి హుండీ ద్వారా రూ.2.16 కోట్ల ఆదాయం # పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # వేములవాడ ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ లేమి – గర్భిణీలకు ఇబ్బందులు # నిర్మల్ జిల్లాలో నారి శక్తి కార్యక్రమం: డయల్-100కు సత్వర స్పందన, అవగాహన కార్యక్రమాలు # పదవ తరగతి విద్యార్థినులకు పెన్నులు, ఎగ్జామ్ ప్యాడ్ల పంపిణీ # జన్నారం మండలంలో నూతన గ్రామ పంచాయతీ భవనాల ప్రారంభం # ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో శిక్షణ ముగింపు కార్యక్రమం # ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి సాధిద్దాం: కలెక్టర్ అభిలాష అభినవ్ # వనస్థలిపురంలో గ్రాండ్ ఇఫ్తార్ పార్టీలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు # ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు శిక్షణ # పీజీ సీట్లు సాధించిన వైద్యులకు బీఆర్ఎస్ నాయకుల ఘన సన్మానం # షాబాద్‌లో మెడికల్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య # పలు వివాహ వేడుకలకు హాజరైన మల్‌రెడ్డి రాంరెడ్డి # బంజారా మహిళ హత్యపై నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ # నూతన వధూవరులను ఆశీర్వదించిన దేప భాస్కర్ రెడ్డి # కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ శత జయంతి సభను విజయవంతం చేయాలని పిలుపు # డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు ఆరోపిస్తూ బీజేపీ నాయకుల భిక్షాటన

పెరిగిన జీతం.. తరిగిన పొదుపు: 'లైఫ్‌స్టైల్ క్రీప్' ఉచ్చులో పడకండి!

ఆదాయం పెరిగే కొద్దీ.. మనకు తెలియకుండానే మన జీవన ప్రమాణాలు పెంచుకుంటూ పోవడాన్ని ‘లైఫ్ స్టైల్ క్రీప్’ అంటారు.

Date : 26 December 2025 06:28 PM Views : 78

Studio18 News - లైఫ్ స్టయిల్ / : ఇప్పుడంతా ఈఎంఐల కాలం.. జీతం ఎంతో ఈఎంఐలు అన్ని ఉంటున్నాయి. లగ్జరీ లైఫ్ కు అలవాటు పడ్డ యువత హోం లోన్, కార్ లోన్, ఇంట్లో టీవీ, ఖరీదైన ఫోన్లు ఇలా అన్నింటిని క్రెడిట్ కార్డులపై, బ్యాంకుల్లో లోన్లుగా తీసుకొని ఈఎంఐలు కడుతూ బతుకును ఇన్ స్టాల్ మెంట్లలో పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే.. పెరిగిన జీతం చేతికి రాగానే కొత్త ఫోన్ కొనేద్దామా? కారు మార్చేద్దామా? అనే యువత ఆలోచిస్తోంది. ఇదే అయితే మీరు ‘లైఫ్ స్టైల్ క్రీప్’ అనే మాయలో పడినట్టే.. ఆదాయం పెరుగుతున్నా ఆర్థికంగా ఎదగలేకపోవడానికి అసలు కారణం ఇదే. ///చాలా మంది ఉద్యోగుల పరిస్థితి ఇప్పుడు ఒకేలా ఉంటోంది. ఏటా ఇంక్రిమెంట్లు వస్తున్నాయి.. ప్రమోషన్లు వస్తున్నాయి. కానీ నెలాఖరు వచ్చేసరికి బ్యాంకు ఖాతాలో మాత్రం నిల్వపెరగడం లేదు. ‘అప్పట్లో తక్కువ జీతం ఉన్నప్పుడే ఎక్కువ సేవ్ చేసేవాళ్లం.. ఇప్పుడు జీతం పెరిగినా చేతిలో చిల్లి గవ్వ మిగలడం లేదు’ అన్నది సగటు మధ్యతరగతి జీవి ఆవేదన.. దీనికి ప్రధాన కారణం లైఫ్ స్టైల్ క్రీప్. ఏమిటీ లైఫ్ స్టైల్ క్రీప్? ఆదాయం పెరిగే కొద్దీ.. మనకు తెలియకుండానే మన జీవన ప్రమాణాలు పెంచుకుంటూ పోవడాన్ని ‘లైఫ్ స్టైల్ క్రీప్’ అంటారు. ఒకప్పుడు లగ్జరీ అనుకున్న వస్తువులు, ఆదాయం పెరగగానే ‘అవసరాలు’గా మారిపోతాయి.. సాధారణ ఫోన్ స్థానంలో ఖరీదైన ఫోన్ వస్తుంది. నడిచే కారు ఉన్నా, హోదా కోసం కొత్త మోడల్ కారు కొంటారు. వారానికి ఒకసారి బయట తినే అలవాటు కాస్తా, వారానికి మూడు సార్లుగా మారుతుంది.. అవసరం లేని ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు, బ్రాండెడ్ దుస్తులపై వ్యామోహం పెరుగుతుంది.

కనిపించని శత్రువు.. కరిగిపోయే సంపద.. లైఫ్ స్టైల్ క్రీప్ అనేది నెమ్మదిగా పాకే శత్రువు. ఇది మీ సంపద సృష్టిని అడ్డుకుంటుంది. పెరిగిన ఆదాయం అంతా ఖర్చులకే సరిపోవడంతో రిటైర్మెంట్ కోసం లేదా అత్యవసర నిధి కోసం డబ్బు దాచలేరు. విలాసవంతమైన జీవనశైలిని మెయింటైన్ చేయడానికి క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్లపై ఆధారపడాల్సి వస్తుంది. ఎక్కువ సంపాదిస్తున్నా రేపటి గురించి భయం వెంటాడుతూనే ఉంటుంది. ఈ ఉచ్చు నుంచి బయటపడాలంటే? ఆర్థిక స్వేచ్ఛను పొందాలంటే జీవనశైలిని కాదు.. మీ ఆస్తులను అప్ గ్రేడ్ చేయాలి. జీతం పెరిగిన వెంటనే ఖర్చులు పెంచకండి. పాత బడ్జెట్ నే మరికొన్నాళ్లు కొనసాగించండి.. పెరిగిన జీతం నుంచి కొంత మొత్తాన్ని వెంటనే ఎస్ఐపీలు లేదా ఆర్డీ ల ద్వారా పెట్టుబడిగా మళ్లించండి. ఏదైనా ఖరీదైన వస్తువులు కొనాలనుకున్నప్పుడు 48 గంటల నియమం పాటించండి.. ఆ సమయం తర్వాత కూడా అది అవసరమే అనిపిస్తేనే కొనండి. విలాసాల కంటే ఆర్థిక భద్రతకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి ఖరీదైన వస్తువులు క్షణికమైన ఆనందాన్ని ఇస్తాయి. కానీ తెలివైన పెట్టుబడులు జీవితాంతం స్వేచ్ఛను ఇస్తాయి. జీతం పెరిగినప్పుడు మీ కారు మోడల్ మారడం కంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం ముఖ్యం. ‘లైఫ్ స్టైల్ క్రీప్’ బారిన పడకుండా జాగ్రత్త పడితేనే నిజమైన సంపద మీకు సాధ్యమవుతుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :