Studio18 News - లైఫ్ స్టయిల్ / : MR Bachchan OTT Partner : మాస్ మహారాజా రవితేజ నటించిన మూవీ మిస్టర్ బచ్చన్. హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. బాలీవుడ్ భామ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. ఈ మూవీ నేడు (ఆగస్టు 15) న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వస్తోంది. టాక్ సంగతి కాస్త పక్కన బెడితే మాత్రం ఇక ఈ సినిమా ఏ ఓటీటీలోకి వస్తుందోనన్న ఆసక్తి అందరిలో మొదలైంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అయితే.. ఈ చిత్ర స్ట్రీమింగ్ ఎప్పుడు అన్నది తెలియరాలేదు. ఇటీవల కాలంలో విడుదలైన అవుతున్న సినిమాల్లో చాలా సినిమాలో రిలీజైన మూడు నుంచి నాలుగు వారాల్లో ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నాయి. ఈ లెక్కన మిస్టన్ బచ్చన్ కూడా ఇలాగే స్ట్రీమింగ్ కానుంది. ఎన్ని రోజులు వెయిట్ చేయాలనేది తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు. కథ : ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్మెంట్‌లో ఆనంద్ బచ్చన్ (రవితేజ) పని చేస్తుంటాడు. అతడు ఓ సిన్సియర్ ఆఫీసర్. పలుకుబడి ఉన్న ఓ వ్యక్తి ఇంట్లో రైడ్ చేసి నల్లధనాన్ని పట్టుకుంటాడు. అయితే.. సదరు వ్యక్తికి, అతడిని సపోర్ట్ చేసిన సీనియర్ ఆఫీసర్‌ని అవమానించడంతో ఉద్యోగం కోల్పోతాడు. దీంతో తన సొంతూరు వచ్చి ఆర్కెస్ట్రా నడుపుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో జిక్కితో(భాగ్యశ్రీ బోర్సే) ప్రేమలో పడతాడు. వీరిద్దరు పెళ్లికి సిద్ధమవుతుండగా ఆనంద్‌కు ఉద్యోగం తిరిగి వస్తోంది. ఎంపీ ముత్యం జగ్గయ్య ఇంట్లో రైడ్ చేయమని అతడికి ఆదేశాలు వస్తాయి. మరో నాలుగు రోజుల్లో పెళ్లి అనగా ఎంపీ ఇంటికి రైడ్‌కు వెళతాడు. రైడ్ లో జగ్గయ్య ఇంట్లో బచ్చన్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు ? అక్కడ నల్లధనం దొరికిందా? జిక్కి తో బచ్చన్ పెళ్లి అయిందా? అసలు ఈ బచ్చన్ పేరు వెనుక ఉన్న కథేంటి తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.
Admin
Studio18 News