Friday, 13 March 2026 04:58:43 AM
# శ్రీపాద ఎల్లంపల్లి నీరు రుద్రంగికి చేరిక… రైతుల్లో ఆనందం # ఇన్నోవేషన్ పంచాయత్ కార్యక్రమానికి యువత ముందుకు రావాలి: కలెక్టర్ రాజర్షి షా # వేములవాడలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు – 8 మందికి జైలు శిక్ష, 106 మందికి జరిమానాలు # వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి హుండీ ద్వారా రూ.2.16 కోట్ల ఆదాయం # పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # వేములవాడ ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ లేమి – గర్భిణీలకు ఇబ్బందులు # నిర్మల్ జిల్లాలో నారి శక్తి కార్యక్రమం: డయల్-100కు సత్వర స్పందన, అవగాహన కార్యక్రమాలు # పదవ తరగతి విద్యార్థినులకు పెన్నులు, ఎగ్జామ్ ప్యాడ్ల పంపిణీ # జన్నారం మండలంలో నూతన గ్రామ పంచాయతీ భవనాల ప్రారంభం # ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో శిక్షణ ముగింపు కార్యక్రమం # ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి సాధిద్దాం: కలెక్టర్ అభిలాష అభినవ్ # వనస్థలిపురంలో గ్రాండ్ ఇఫ్తార్ పార్టీలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు # ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు శిక్షణ # పీజీ సీట్లు సాధించిన వైద్యులకు బీఆర్ఎస్ నాయకుల ఘన సన్మానం # షాబాద్‌లో మెడికల్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య # పలు వివాహ వేడుకలకు హాజరైన మల్‌రెడ్డి రాంరెడ్డి # బంజారా మహిళ హత్యపై నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ # నూతన వధూవరులను ఆశీర్వదించిన దేప భాస్కర్ రెడ్డి # కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ శత జయంతి సభను విజయవంతం చేయాలని పిలుపు # డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు ఆరోపిస్తూ బీజేపీ నాయకుల భిక్షాటన

Ilayaraja: ఇప్పుడొస్తున్న పాటలపై ఇళయరాజా ఆసక్తికర వ్యాఖ్యలు

Date : 07 November 2025 06:40 PM Views : 129

Studio18 News - లైఫ్ స్టయిల్ / : ఇప్పటి పాటలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఇళయరాజా ఆ పాటలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదన్న మేస్ట్రో విజయవాడలో తొలిసారిగా సంగీత కచేరీ సందర్భంగా వ్యాఖ్యలు పాతతరం సంగీత సృష్టి విధానాన్ని గుర్తు చేసుకున్న వైనం మేల్ సింగర్ ఏం పాడారో ఫీమేల్‌కు తెలియడం లేదని విమర్శ ఒకప్పుడు 60 మందితో కలిసి పాటలు చేసేవాళ్లమని వెల్లడి ప్రముఖ సంగీత దర్శకుడు, ‘మేస్ట్రో’ ఇళయరాజా ప్రస్తుత తరం సంగీతంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కాలంలో వస్తున్న పాటలు ఎందుకోసం వస్తున్నాయో కూడా తెలియడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో తొలిసారిగా నవంబర్ 8న నిర్వహిస్తున్న తన సంగీత కచేరీ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తన జీవితమంతా సంగీతమయమని, తన పాటల్లో జీవం, భావోద్వేగాలు ఉంటాయని, అందుకే అవి ప్రేక్షకుల హృదయాలను తాకాయని ఇళయరాజా అన్నారు. ‘‘ఇప్పటి పాటల పరిస్థితి దారుణంగా ఉంది. ఒక మేల్ సింగర్ పాడింది, ఫీమేల్ సింగర్‌కు తెలియడం లేదు. వాళ్లు పాడింది వీళ్లకు తెలియదు... వీళ్లు పాడింది వాళ్లకు తెలియదు... చివరికి ఎలాంటి పాట వస్తుందో దర్శకుడికి కూడా తెలియని పరిస్థితి నెలకొంది’’ అని ఆయన విమర్శించారు. గతంలో పాటల తయారీ విధానం ఎంతో పద్ధతిగా, అందరి కృషితో జరిగేదని ఇళయరాజా గుర్తుచేసుకున్నారు. ‘‘ఒకప్పుడు 60 మంది ఆర్కెస్ట్రా ఒకేచోట కూర్చొని పాటలు కంపోజ్ చేసేవాళ్లం. రికార్డింగ్ సమయం, పాడేవాళ్లు, స్టూడియో వివరాలన్నీ కచ్చితంగా రాసుకునేవాడిని. రిహార్సల్స్ చేసి, పాట సరిగ్గా వచ్చిందని నిర్ధారించుకున్నాకే విడుదల చేసేవాళ్లం. 60 మంది ఒకేసారి శ్రమిస్తే నాలుగు నిమిషాల పాట పూర్తయ్యేది. ఇప్పుడు సంగీతకారులు కనీసం ఒక లైన్‌లో కూడా ఉండటం లేదు’’ అని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తన పాటలను ఆదరిస్తున్న ప్రేక్షకులు, అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. విజయవాడలో జరగనున్న తన కచేరీకి పెద్ద సంఖ్యలో అభిమానులు వస్తారని ఆశిస్తున్నట్లు సంతోషం వ్యక్తం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :