Friday, 13 March 2026 04:58:41 AM
# శ్రీపాద ఎల్లంపల్లి నీరు రుద్రంగికి చేరిక… రైతుల్లో ఆనందం # ఇన్నోవేషన్ పంచాయత్ కార్యక్రమానికి యువత ముందుకు రావాలి: కలెక్టర్ రాజర్షి షా # వేములవాడలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు – 8 మందికి జైలు శిక్ష, 106 మందికి జరిమానాలు # వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి హుండీ ద్వారా రూ.2.16 కోట్ల ఆదాయం # పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # వేములవాడ ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ లేమి – గర్భిణీలకు ఇబ్బందులు # నిర్మల్ జిల్లాలో నారి శక్తి కార్యక్రమం: డయల్-100కు సత్వర స్పందన, అవగాహన కార్యక్రమాలు # పదవ తరగతి విద్యార్థినులకు పెన్నులు, ఎగ్జామ్ ప్యాడ్ల పంపిణీ # జన్నారం మండలంలో నూతన గ్రామ పంచాయతీ భవనాల ప్రారంభం # ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో శిక్షణ ముగింపు కార్యక్రమం # ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి సాధిద్దాం: కలెక్టర్ అభిలాష అభినవ్ # వనస్థలిపురంలో గ్రాండ్ ఇఫ్తార్ పార్టీలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు # ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు శిక్షణ # పీజీ సీట్లు సాధించిన వైద్యులకు బీఆర్ఎస్ నాయకుల ఘన సన్మానం # షాబాద్‌లో మెడికల్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య # పలు వివాహ వేడుకలకు హాజరైన మల్‌రెడ్డి రాంరెడ్డి # బంజారా మహిళ హత్యపై నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ # నూతన వధూవరులను ఆశీర్వదించిన దేప భాస్కర్ రెడ్డి # కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ శత జయంతి సభను విజయవంతం చేయాలని పిలుపు # డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు ఆరోపిస్తూ బీజేపీ నాయకుల భిక్షాటన

Rakshit Atluri: శివాజీకి బహిరంగంగా మద్దతుగా నిలిచిన నటుడు రక్షిత్ అట్లూరి

Date : 27 December 2025 07:29 PM Views : 78

Studio18 News - లైఫ్ స్టయిల్ / : శివాజీ వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదన్న రక్షిత్ అట్లూరి ఆయన వ్యాఖ్యల్లోని యథార్థాన్ని అర్థం చేసుకోవాలని వ్యాఖ్య సమాజం మారాల్సిన అవసరం ఉందన్న రక్షిత్ మహిళలు ఎంతో గొప్పవారని వ్యాఖ్య టాలీవుడ్‌లో ‘దండోరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు రేపిన దుమారం ఇంకా చల్లారడం లేదు. స్టేజ్‌పై ఆయన ఉపయోగించిన కొన్ని పదాలు తీవ్ర విమర్శలకు దారి తీయడంతో, ఈ అంశం సినిమా పరిధిని దాటి సామాజిక చర్చగా మారింది. మహిళల దుస్తులపై శివాజీ చేసిన వ్యాఖ్యలపై గాయని చిన్మయి, నటి అనసూయతో పాటు పలువురు మహిళా ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. విమర్శల నేపథ్యంలో శివాజీ క్షమాపణలు కూడా చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, క్షమాపణ చెప్పినా ఆయన మాటల్లోని భావజాలమే అసలు సమస్య అంటూ విమర్శకులు మరో అడుగు ముందుకు వేశారు. ఈ క్రమంలో ఇండస్ట్రీ నుంచి భిన్నమైన స్వరాలు వినిపించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా నటుడు రక్షిత్ అట్లూరి కూడా శివాజీకి మద్దతుగా నిలిచారు. ‘పలాస 1978’ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రక్షిత్ అట్లూరి, ఈ వివాదంపై ఓ వీడియో విడుదల చేస్తూ తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు. శివాజీ వాడిన కొన్ని పదాలు తప్పు కావచ్చని అంగీకరించిన రక్షిత్, అందుకే ఆయన క్షమాపణలు కూడా చెప్పారని గుర్తు చేశారు. అయితే, శివాజీ చెప్పాలనుకున్న అసలు ఉద్దేశంలో మాత్రం తప్పు లేదని చెప్పారు. శివాజీ మాటల్లోని యథార్థాన్ని అర్థం చేసుకోవాలని రక్షిత్ అన్నారు. సమంత చీర కట్టుకున్నా ఆమెకు ఏదో జరిగిందని కొందరు అంటున్నారని... సంప్రదాయబద్దంగా దుస్తులు ధరించినా ఇలా జరిగిందంటే... మనం ఎలాంటి సమాజంలో ఉన్నామో ఆలోచించుకోవాలని చెప్పారు. ఇలాంటి సమాజంలో మనం మరింత జాగ్రత్తగా ఉండాలని అన్నారు. సమాజం మారాల్సిన అవసరం ఉందని చెప్పారు. కుటుంబాలు కూడా తమ పిల్లల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళల గొప్పతనాన్ని గుర్తు చేస్తూ రక్షిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. “మహిళలు తక్కువా? ఎక్కువా? అనే ప్రశ్నే లేదు. వాళ్లు ఎంతో గొప్పవారు. మగవాళ్లుగా మన బాధ్యత వాళ్లను గౌరవించడం, రక్షించడం. ఆ రక్షణ గురించే శివాజీ గారు చెప్పాలని ప్రయత్నించారని నేను భావిస్తున్నాను” అని తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :