Saturday, 14 December 2024 02:30:38 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

మనిషి వద్దు మరమనిషే ముద్దు..! భవిష్యత్తులో మహిళలు తమ లైంగిక అవసరాలు తీర్చుకునేది వాటితోనే…!

Date : 08 October 2024 10:41 AM Views : 75

Studio18 News - లైఫ్ స్టయిల్ / : Romance With Robos : రొమాన్స్ విషయంలో మహిళల ఆలోచనల్లో మార్పు రానుందా? శృంగారం విషయంలో మనుషులకంటే.. మర మనషులు.. అదేనండీ.. రోబోలనే ఎక్కువ ఇష్టపడతారా? పడక గదిలో తమ లైంగిక అవసరాలను తీర్చుకోవడానికి పురుషులను పక్కన పెట్టి రోబోలను ఎక్కువగా లైక్ చేస్తారా? తమ కోరికలను తీర్చుకునే విషయంలో పురుషుల కంటే కూడా.. రోబోలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా? అంటే.. నిపుణులు అవుననే అంటున్నారు. రానున్న రోజుల్లో మహిళలు తమ లైంగిక కోరికలను తీర్చుకోవడానికి పురుషులను కాకుండా రోబోలనే ఎక్కువగా ఇష్టపడతారని చెబుతున్నారు ఫ్యూచరాలజిస్ట్ డాక్టర్ పియర్సన్. భవిష్యత్తులో పడక గదుల్లో ఇలాంటి గణనీయమైన మార్పులు వస్తాయని అభిప్రాయపడుతున్నారు. 2025 నాటికి ధనవంతుల కుటుంబాల్లో ఈ తరహా రోబోలు పుట్టుకొస్తాయని ఓ అధ్యయంనలో తేలింది. రోబోలతో కేవలం లైంగిక కోరికలను తీర్చుకోవడానికి మాత్రమే కాదు.. వాటితో ప్రేమలో కూడా పడతారట. చాలామంది ఈ ఆలోచనను కొట్టిపారేయొచ్చు. కానీ, రొమాన్స్ టాయ్స్, రొమాన్స్ డాల్స్ వాడే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ పరిశ్రమ విస్తరిస్తోంది. తమ లైంగిక అవసరాలు తీర్చుకునేందుకు ఎక్కువ మంది రోబోలవైపు మొగ్గు చూపుతున్నారు. 2050 నాటికి సాధారణ శృంగారం కంటే రోబోట్ రొమాన్స్ సర్వసాధారణం అవుతుందని, ఇది మానవుల ప్రేమను పూర్తిగా మరుగుపరుస్తుందని నిపుణులు అంచనా వేశారు. ది రైజ్ ఆఫ్ ది రోబో రొమాన్స్ అనే పేపర్.. 2030 నాటికి వర్చువల్ రియాలిటీ శృంగారం సర్వ సాధారణం అవుతుందని అంచనా వేసింది. 2035 నాటికి రొమాన్స్ టాయ్‌లు వర్చువల్ రియాలిటీ శృంగారంతో ముడిపడి ఉంటాయని కూడా పేర్కొంది. రోబోలతో శృంగారం.. భావోద్వేగ అవరోధాలను మరింత తగ్గించి, అపరాధభావాన్ని దూరం చేస్తాయట. దానికితోడు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని నిపుణులు అంటున్నారు. ”భవిష్యత్తులో మహిళలు రోబోలతో లవ్ లో పడతారు. అంతకుమంచి శృంగారం విషయంలో పురుషుల కంటే కూడా వాటినే ఎక్కువగా ఇష్టపడతారు. 2030 నాటికి వర్చువల్ రియాలిటీ రొమాన్స్ కామన్ గా మారిపోతుంది. 2035 నాటికి శృంగార సంబంధ పరికరాలు దీంతో లింక్ అవుతాయి. 2050 నాటికి రోబోట్ శృంగారం సర్వ సాధారణంగా మారుతుంది” అని ఫ్యూచరాలజిస్ట్ డాక్టర్ పియర్సన్ తెలిపారు. ఏది ఏమైనా.. నిజమైన బంధానికి ఎప్పటికీ అధిక విలువ ఉంటుందని నిపుణులు తేల్చారు. అదే సమయంలో రోబో శృంగారాన్ని ముప్పుగా చూడకూడదన్నారు. వాస్తవానికి అదొక వరంగా అభివర్ణించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :