Thursday, 26 March 2026 04:59:29 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

హైదరాబాద్‌లో ఘోరం.. ప్రియుడి కోసం కన్నతల్లి హత్య.. ఇంట్లోనే పూడ్చిపెట్టి 10 నెలలుగా నాటకం!

Date : 25 March 2026 05:11 PM Views : 4

Studio18 News - క్రైమ్ / HYDERABAD : హైదరాబాద్ నగరంలో పది నెలల క్రితం జరిగిన ఓ మహిళ హత్య కేసు మిస్టరీ వీడింది. ప్రేమకు అడ్డుచెబుతోందన్న కారణంతో కన్నతల్లినే ఓ కూతురు తన ప్రియుడితో కలిసి హత్య చేసి, మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చిపెట్టిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్ జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూర్ భరత్‌నగర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. ఓ బైక్ ఆధారంగా పోలీసులు ఈ కేసును ఛేదించారు. వివరాల్లోకి వెళితే... భరత్‌నగర్‌కు చెందిన అంజు అనే మహిళ పది నెలల క్రితం అదృశ్యమైంది. దీంతో ఆమె పెద్ద కుమార్తె బొల్లారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పది నెలలుగా దర్యాప్తు చేస్తున్నా కేసు కొలిక్కి రాకపోవడంతో పోలీసులు దీన్ని సవాలుగా తీసుకున్నారు. ఈ క్రమంలో అంజు చిన్న కుమార్తె ఇషిక, ఆమె ప్రియుడు మౌంటీరాజ్‌పై అనుమానంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారు వాడిన బైక్ ఈ కేసులో కీలక ఆధారంగా మారినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల విచారణలో ఇషిక అసలు నిజాన్ని అంగీకరించింది. ఇషిక, మౌంటీరాజ్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని, సహజీవనం చేయాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. అయితే, వీరి ప్రేమ వ్యవహారాన్ని తల్లి అంజు తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రియుడిని వదిలేయాలని కూతురిని మందలించింది. దీంతో తమ ప్రేమకు అడ్డుగా ఉందని భావించి, తల్లిని హతమార్చాలని ఇషిక, మౌంటీరాజ్ నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం అంజును దారుణంగా హత్య చేసి, ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని అదే ఇంట్లో గొయ్యి తీసి పూడ్చిపెట్టారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు నటిస్తూ, తన అక్కతో కలిసి తల్లి కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేయించారు. ఈ దారుణ ఘటన బయటపడటంతో పోలీసులు ఇషిక, మౌంటీరాజ్‌లను అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు మెజిస్ట్రేట్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసే పనులు చేపట్టారు. కేవలం నాలుగు రోజుల పరిచయమైన ప్రియుడి కోసం కన్నతల్లిని కూతురే కిరాతకంగా చంపడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :