Studio18 News - క్రైమ్ / : సూర్యాపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పైఅధికారి లైంగిక వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకుంది. ఘటన వివరాల్లోకెళితే..సూర్యాపేట లయన్స్ క్లబ్ లో పనిచేస్తున్న కొత్తపల్లి కిరణ్మయి ఉద్యోగిగా పనిచేస్తోంది. మూడు నెలలుగా పవన్ అనే ఉద్యోగి టార్చర్ పెడుతున్నాడని ఆరోపిస్తూ వస్తోంది. లొంగకపోతే ఉద్యోగం లోంచి తీసేస్తామంటూ బెదిరింపులు ఎక్కువ కావడంతో తట్టుకోలేకపోయింది. మనస్తాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. లయన్స్ క్లబ్ వద్ద కిరణ్మయి మృతదేహంతో తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన చేశారు.
Also Read : ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు
Admin
Studio18 News