Monday, 23 June 2025 03:25:32 PM
# మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్!

దొంగలతో హోంగార్డు ఫ్రెండ్‌షిప్‌.. చోరీ చేసిన సొమ్ములో వాటాలు పంచుకుంటూ ఎంజాయ్..

Date : 01 August 2024 04:31 PM Views : 107

Studio18 News - క్రైమ్ / : Police Chor Dosti: కరడుగట్టిన కేడీ గాళ్లను కటకటాల పాలు చేసిన పోలీసులు చూశాం.. కాకలు తీరిన బడా చోర్‌ల ఆట కట్టించిన ఖాకీల గురించి విన్నాం.. కానీ ఎప్పుడైనా.. ఎక్కడైనా..దొంగతలతో దోస్తీ కట్టిన పోలీసులను చూశారా.. చోరీ చేసిన సొమ్ములో దొంగలతో కలిసి వాటాలు పంచుకున్న ఖాకీల గురించి విన్నారా.. దొంగలతో దోస్తీ కట్టిన ఆ పోలీసులెవరో మీరే చూడండి. నేరాలను అడ్డుకోవాల్సిన ఖాకీలు దొంగలతో చేతులు కలిపారు. రెండేళ్లుగా దొంగలకు సహకరిస్తున్నారు. చోరీ చేసిన సొమ్ములో వాటాలు పంచుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. కట్ చేస్తే.. దొంగలముఠాతో కలిపి ఇప్పుడు ఆ పోలీసులు కటకటాలపాలయ్యారు. చైన్ స్నాచింగ్స్ పై పోలీసులు ఫోకస్ హైదరాబాద్‌లో ఇటీవల కాలంలో చైన్ స్నాచింగ్స్, సెల్ ఫోన్లు దొంగతనాలు గణనీయంగా పెరిగాయి. దీంతో సెల్ ఫోన్స్ చోరీ, చైన్ స్నాచింగ్స్ పై పోలీసులు ఫోకస్ పెట్టారు. అయితే జూలై 23దీన ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్‌లో ఫోన్ దొంగలించడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని ప్రయాణికుడు పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. నిందితుడు వెస్ట్ బెంగాల్‌కు చెందిన అల్ అమీన్ ఖాజీగా గుర్తించారు. నిందితుని విచారించగా తాము గ్యాంగ్‌గా ఏర్పడి నగరంలో ఫోన్లను దొంగిలిస్తున్నట్లు ఒప్పకున్నాడు. ఈ నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా MS మక్తాలో ఓ ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ ఇంట్లో ఫోన్లు, చైన్ స్నాచింగ్ చేస్తున్న మరో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని తమదైన శైలిలో విచారించిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. ఈ దొంగలతో ముగ్గురు పోలీసులు దోస్తీ కట్టారని పోలీసులకు తెలియడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అసలు కథలోకి వెళ్తే.. ఎస్సార్ నగర్‌లో హోంగార్డుగా పని చేస్తున్న అశోక్‌ అప్పట్లో నిర్వహిస్తుండగా మహ్మద్‌ షాన వాజ్‌ అనే ఓ దొంగను పట్టుకున్నాడు. చిన్న కేసు పెట్టి ఆ దొంగను పోలీసులు వదిలేశారు. అలా వదిలేసిన ఆ దొంగతో హోంగార్డు అశోక్ స్నేహం చేశాడు. అలా ఆ దొంగల ముఠా ఎక్కడైనా పట్టుబడినా.. హోంగార్డు అశోక్ వకాల్తా పుచ్చుకొని దొంగల మీద కేసు కాకుండా బయటకు తీసుకొచ్చేవాడు. అందుకు ప్రతిఫలంగా వాటాలు పంచుకునేవాడు. అయితే అశోక్‌ నగరంలో వేరే చోటకు ట్రాన్స్‌ఫర్‌ అయినా కూడా దొంగతో స్నేహం వీడలేదు. హైదరాబాద్‌కు కొత్త దొంగల ముఠా వచ్చినప్పుడు.. ఆ ముఠా సభ్యుల ఫోటోలు అశోక్‌కు పంపించి ఎక్కడైనా పట్టుబడితే కేసు లేకుండా చేయాలని చోరీగాళ్లు అశోక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. భార్యకు ఫోన్‌పే చేసి దొరికిపోయాడు! ఇదే సందర్భంలో గాంధీ నగర్, సైఫాబాద్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు సోమన్న, సాయిరాంలకు అశోక్‌ ఈ దొంగల ముఠాను పరిచయం చేశాడు. సైఫాబాద్ ఏరియాలో ఈ దొంగల ముఠా సభ్యుడు పట్టుబడడంతో అతన్ని సైఫాబాద్‌ కానిస్టేబుల్ సహకారంతో విడిపించాడు. ఆ తర్వాత ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్‌లో ముఠా సభ్యుడు పోలీసులకు పట్టు పడడంతో హోంగార్డు, కానిస్టేబుళ్ల బండారం బయటపడింది. కొన్నేళ్లుగా.. హోంగార్డు అశోక్ సహకారంతో ఇద్దరు కానిస్టేబుళ్లు దొంగలకు సహకరిస్తూ వాటాలు పంచుకుంటున్నారని పోలీసులు తెలిపారు. దొంగలకు సహకరిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు సోమన్న, సాయిరాంలతో పాటు.. హోంగార్డు అశోక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు విచారణలో పోలీసులు విస్తుపోయే విషయాలు వెల్లడించారు. దొంగలతో సొమ్మును పొందుతున్న హోంగార్డ్ అశోక్ తెలివిగా తన నెంబర్ ఖాతాలో డబ్బులు వేసుకోకుండా.. భార్య ఖాతాలో డబ్బులు జమ చేసుకుంటున్నాడు. ఎప్పుడూ దొంగల ముఠా వద్ద నగదు తీసుకొని అశోక్.. ఓ సారి తనే తన భార్యకు ఫోన్‌పే చేయడంతో తతంగం బయటపడింది. వెలుగులోకి కొత్త విషయాలు మరోవైపు సెల్‌ఫోన్లు, చైన్ స్నాచర్ల కేసులో మరింత లోతుగా విచారణ చేపట్టగా అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్‌లో ఫోన్ దొంగలించడానికి ప్రయత్నించిన అల్ అమీన్ ఖాజీ వెనకాల అంతర్జాతీయ ముఠా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. జార్ఖండ్‌ రాష్ట్రం లోని తీన్‌పహార్‌ గ్రామానికి చెందిన రాహుల్‌ కుమార్‌ యాదవ్‌ కొంతమందితో ముఠా ఏర్పాటు చేశాడు. ఆ ముఠాలో అందరూ చిన్నపిల్లలే. వీరికి ముందే శిక్షణ ఇచ్చి సెల్‌ఫోన్లు ఎలా కొట్టేయాలో నేర్పిస్తారు. అనంతరం వీరిని చోరీలు చేసేందుకు హైదరాబాద్‌, సూరత్‌, లక్నో, రాంచీ, బేలూర్‌, చెన్నై, వారణాసి, నాగ్‌పూర్‌, పాట్నా తదితర ప్రాంతాలకు పంపిస్తారు. సభ్యులు 50 సెల్‌ఫోన్లు జమచేసి యాదవ్‌కు ఇచ్చేవారు. సెల్‌ఫోన్లు తీసుకెళ్లేందుకు యాదవ్‌ విమానంలో వచ్చి, వెళ్లేటప్పుడు మాత్రం రైలులో వెళ్లేవాడు. సెల్‌ఫోన్లతో వెళ్తే విమానాశ్రయాల్లో దొరికిపోయే ప్రమాదం ఉంది కాబట్టి రైలునే ఎంచుకునే వాడు. సెల్‌ఫోన్లు అమ్మాక అందరికీ డబ్బు పంపించేవాడు. నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. బిహార్‌ రాష్ట్రానికి చెందిన మహ్మద్‌ షాహనవాజ్‌, జోనుకుమార్‌, జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన గోవిందకుమార్‌ మహ్తో, జుగేశ్వర్‌ నోనియా, ఎండీ ముఖ్తార్‌షేక్‌ లను అరెస్టు చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :