Tuesday, 03 December 2024 05:39:50 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు

హత్యాచారం కేసు మొత్తం మాజీ పోలీసు కమీషనర్ వినీత్ గోయల్ కుట్రన్న సంజయ్ రాయ్ తనను ఇరికించారన్న నిందితుడు విచారణలో భాగంగా కోర్టుకు తీసుకొచ్చిన సమయంలో సంచ

Date : 12 November 2024 04:32 PM Views : 73

Studio18 News - క్రైమ్ / : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం ఘటన కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ కేసు మొత్తం కోల్‌కతా మాజీ పోలీస్ కమీషనర్ వినీత్ గోయల్‌ కుట్ర అని ఆరోపించాడు. ఈ కేసులో తనను ఇరికించారని పేర్కొన్నాడు. సంజయ్ రాయ్‌ని సీల్దా కోర్టు నుంచి పోలీసు వ్యానులో తీసుకెళుతున్న సమయంలో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘‘ ఈ కుట్ర (వైద్యురాలిపై అత్యాచారం, హత్య) అంతా వినీత్ గోయల్‌దే. నన్ను ఇరికించాడని నేను మీకు చెబుతున్నాను’’ అని సంజయ్ రాయ్ అన్నాడు. ఈ కేసు విచారణలో భాగంగా సోమవారం అతడిని పోలీసులు సీల్డా కోర్టుకు తరలించారు. జిల్లా అడిషనల్, సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ విచారణ జరిపారు. కేసుతో సంబంధం లేని వారిని అనుమతించకుండా, ఈ విచారణను కోర్టు గది తలుపులు మూసి ఉంచి నిర్వహించారు. కాగా భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 64 (రేప్), సెక్షన్ 66‌తో పాటు (మరణానికి కారణం) పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ అనే ప్రభుత్వ హాస్పిటల్‌లో రాత్రి డ్యూటీలో ఉన్న ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య జరిగిన విషయం తెలిసిందే. నిందితుడు సంజయ్ రాయ్‌ని ఆగస్టు 10న పోలీసులు అరెస్టు చేశారు. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసు దర్యాప్తును చేపడుతోంది.

Also Read : తెలంగాణ సీఎం వచ్చి అబద్ధాలు చెప్పాడు: మహారాష్ట్రలో కిషన్ రెడ్డి ఆగ్రహం

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :