Studio18 News - క్రైమ్ / : ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు వెంకటేశ్వరపురం, భగత్ సింగ్ కాలనీలో ఓ మైనర్ బాలిక (13), 45 ఏళ్ల మహిళపై అలీ అనే వ్యక్తి లైంగికంగా దాడి చేసి, బెదిరించాడంటూ జనసేన వీరమహిళ విభాగం ట్వీట్ చేసింది. దీన్ని రీట్వీట్ చేస్తూ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. ‘నిందితుడిపై ఏపీ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. నేరాలపై అందరూ భయపడకుండా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అటువంటి నేరాలను నివారించడానికి నేను ఉన్నతాధికారులతో మాట్లాడి పలు సూచనలు చేస్తాను’ అని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. పవన్ ట్వీట్‌పై హోంమంత్రి అనిత స్పందించారు. ‘పవన్ కల్యాణ్‌తో పాటు ప్రజలు హోంమంత్రిగా నేను హామీ ఇవ్వాలనుకుంటున్నాను. నెల్లూరులో జరిగిన దారుణ ఘటనను అత్యంత సీరియస్‌గా తీసుకుంటున్నాము. నెల్లూరు ఎస్పీతో నేరుగా మాట్లాడాను.. విచారణ జరుగుతోంది. బాధితులకు న్యాయం చేసేందుకు కట్టుబడి ఉన్నాం. ఇలాంటి దారుణమైన చర్యలను సహించేది లేదు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడడానికి, పౌరులకు భద్రతపై భరోసా కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నాం. ప్రజల భద్రత, ముఖ్యంగా మహిళలు, చిన్నారుల రక్షణ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం దృఢ వైఖరితో ఉంది’ అని అనిత చెప్పారు.
Also Read : లక్నో బయల్దేరిన రామ్ చరణ్
Admin
Studio18 News