Tuesday, 03 December 2024 04:51:12 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్..

రూ.150 కోట్లకు ముంచిన ఆర్జే వెంచర్స్..

Date : 23 November 2024 11:46 PM Views : 62

Studio18 News - క్రైమ్ / : హైదరాబాద్ లో మరో రియల్ ఎస్టేట్ మోసం వెలుగులోకి వచ్చింది. ప్రీ లాంచింగ్ పేరిట ప్రీ ప్లాన్డ్ గా మోసం చేశారు. 600 మంది నుంచి ఏకంగా రూ.150 కోట్లు వసూలు చేశారు. ఇప్పటికే నాలుగేళ్లు అయినా ఇంతవరకు ఇసుక పేర్చింది లేదు, నిర్మాణం చేసింది లేదు. బాధితులు ఎప్పుడు అడిగినా.. ఇదిగో ఇస్తాం, అదిగో కడుతున్నాం అంటూ నమ్మబలుకుతూ వచ్చారు నిర్వాహకులు. ఇక, మోసపోయామని తెలుసుకున్న బాధితులు బషీర్ బాగ్ సీసీఎస్ ముందు ఆందోళనకు దిగారు. ఆర్జే వెంచర్స్ ఆస్తులు అమ్మి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ లో వరుసగా రియల్ ఎస్టేట్ మోసాలు బయట పడుతున్నాయి. ఇప్పటికే న్యాయం చేయాలంటూ వందలాది మంది బాధితులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. తాజాగా మరో రియల్ ఎస్టేట్ కంపెనీ దగా వెలుగులోకి వచ్చింది. తమను నిండా ముంచింది అంటూ బాధితులు బషీర్ బాగ్ సీసీఎస్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. ”ఆర్ హోమ్స్ వాళ్లు మోసం చేశారు. దాని డైరెక్టర్ చక్కా భాస్కర్, చక్కా సుధారాణి దంపతులు. వీళ్లు మమ్మల్ని నమ్మించి మోసం చేశారు. ఘట్ కేసర్ దగ్గర ప్రీ లాంచ్ ఆఫర్ లో అపార్ట్ మెంట్ తీసుకున్నాం. మా తమ్ముడు, మా బాబాయ్ మేము ముగ్గురం కలిపి మూడు అపార్ట్ మెంట్లకు కోట రూపాయలు కట్టాము. ఇలా 150 మంది వరకు ప్రీ లాంచ్ ఆఫర్ లో బుక్ చేసుకున్నారు. హెచ్ఎండీఏ పర్మిషన్ వచ్చాకే డబ్బు కట్టామన్నారు. అలానే చేశాం. కానీ, ఇంతవరకు ఒక ఇటుక పేర్చింది లేదు, కట్టింది ఏమీ లేదు. మ్యూజిక్ డైరెక్టర్ కోటి లాంటి వారిని తీసుకురావడంతో మేము నమ్మాము. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు. ఆఫీసుకి వెళ్లినా అందుబాటులో ఉండరు. గట్టిగా మాట్లాడితే బౌన్సర్లతో దాడి చేయిస్తారు. పొరపాటున కాల్ కు కనెక్ట్ అయితే.. మీ డబ్బులు ఎక్కడికీ పోవండి, మీకు ప్లాట్లు అయితే ఇస్తాం, ఇక్కడ కాకపోతే మరో చోట అయినా ఇస్తాం, మిమ్మల్ని మాత్రం మోసం చేయము అనే ముచ్చట చెబుతారు. కానీ, అక్కడ ఏ ప్రాజెక్ట్ కూడా లేదు. ఒక ఇటుక పేర్చింది కూడా లేదు. కనీసం ఒక ప్లాటు రిజిస్ట్రర్ అయింది కూడా లేదు” అని ఓ బాధితుడు వాపోయారు. ”నేను 35 లక్షలు కట్టాను. 2020లో నాకు 70 గజాల ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించారు. దానికి గాను 1630 ఎస్ ఎఫ్ టీలో.. ప్లాట్ కట్టించి ఇస్తామని ఒప్పుకున్నారు. నా కూతురి కోసం ఆ డబ్బు పెట్టాను. రెండున్నరేళ్లకు ప్లాట్ ఇస్తామన్నారు. రెండున్నరేళ్లు గడిచిపోయాయి. అప్పటి నుంచి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మా డబ్బులు మాకివ్వండి అని ఎన్నోసార్లు తిరిగాము. కానీ ప్రయోజనం లేదు” అని మరో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రోజుల క్రితం సువర్ణభూమితో పాటు భారతీ డెవలపర్స్ మోసాలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆర్జే వెంచర్స్ మోసం బయటపడింది.

Also Read : ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు ..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రసారమవుతున్న STUDIO 18 NEWS చానల్ నందు పని చేయుటకుగాను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో జిల్లాల వారిగా స్టాఫ్ రిపోర్టర్లు, నియోజకవర్గాల వారిగా రిపోర్టర్లు వెంటనే కావలెను. తెలుగులో చదవటం, మాట్లాడటం, రాయడం వచ్చి, మీ స్థానిక సమస్యలపై అవగాహనతో పాటు 20 సంవత్సరాల వయస్సు దాటిన స్త్రీ, పురుష అభ్యర్థులు రిపోర్టర్లుగా చేరుటకు అవకాశం కల్పించబడుతుంది. అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత కలదు. కొత్తగా మీడియా రంగంలోకి రావాలనుకునే వారికి సైతం అవకాశం. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలచే గుర్తింపు పొంది అక్రిడేషన్ సౌకర్యం కలిగిన సంస్థ. ISO 10002 : 2018 గుర్తింపు కలిగినది. అర్హులైన రిపోర్టర్లకు అక్రిడేషన్ కల్పించబడును. పూర్తి వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ : 7799975556.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :