Studio18 News - క్రైమ్ / : నిర్మల్ జిల్లా బాసర IIITలో విషాదం చోటుచేసుకుంది. పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న స్వాతి ప్రియ హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొనిఆత్మహత్య చేసుకుంది. కాగా స్వాతి ప్రియ స్వగ్రామం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పేర్కిట్. విద్యార్థిని మృతిపై తల్లిదండ్రుల ఆందోళన వ్యక్తం చేశారు. మేము రాకముందే శవాన్ని హాస్పిటల్ మార్చురీకి ఎందుకు తీసుకొచ్చారని పోలీస్ గల్లా పట్టుకొని స్వాతి ప్రియ తల్లి నిలదీసింది. తమ కూతురు ర్యాగింగ్‌కు బలైందంటూ.. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే దానికి పోలీసులు సహకరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
Also Read : తెలంగాణ వారికే ప్రాధాన్యత: 'చిత్రపురి' ఫ్లాట్లపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన
Admin
Studio18 News