Saturday, 24 January 2026 07:41:02 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

స్కూలు వద్ద 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు.. అడ్డుకునే ప్రయత్నం చేసిన వారిపై కాల్పులు..

రాజస్థాన్‌లోని డీగ్ జిల్లో ఘటన బాలికకు గతేడాదే వివాహం అదనపు కట్నం కోసం అత్తమామల వేధింపులు భరించలేక కొన్ని నెలల క్రితం పుట్టింటికి కిడ్నాప్ వారిపనేనన్

Date : 26 December 2024 02:34 PM Views : 672

Studio18 News - క్రైమ్ / : రాజస్థాన్‌లోని డీగ్ జిల్లాలో పట్టపగలు ఓ స్కూలు విద్యార్థిని కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. సుమోలో వచ్చిన ముగ్గురు నలుగురు కిడ్నాపర్లు బాలికను బలవంతంగా కారులోకి ఎక్కించుకున్నారు. ఈ క్రమంలో స్థానికులను భయపెట్టేందుకు కాల్పులు జరిపారు. బాలికకు గతేడాదే వివాహమైందని, కట్నం కోసం అత్తమామలు వేధించడంతో తిరిగి ఇంటికి వచ్చేసిందని బాలిక తండ్రి తెలిపారు. ఈ కిడ్నాప్ వెనక వారి హస్తం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కారులో వచ్చిన నిందితులు తుపాకి గురిపెట్టి మరీ బాలికను కిడ్నాప్ చేసినట్టు పోలీసులు తెలిపారు. వారిని ఆపేందుకు స్థానికులు ప్రయత్నించగా కొన్ని రౌండ్లు కాల్పులు జరిపారు. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పేర్కొన్నారు. ఈ కిడ్నాప్ ఘటన అక్కడ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఇది అధికార, ప్రతిపక్ష నేతల మధ్య విమర్శలకు కారణమైంది. ముఖ్యమంత్రి మోహన్‌లాల్ శర్మ సొంత జిల్లా భరత్‌పూర్‌లో జరిగిన ఈ ఘటనపై కాంగ్రెస్ దుమ్మెత్తి పోస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించాయి. బాలిక స్కూలు వద్ద నడుచుకుంటూ వెళ్తుండగా ఆమెకు సమీపంలో ఓ సుమో వచ్చి ఆగింది. అందులోంచి దిగిన ఇద్దరు వ్యక్తులు బాలికను బలవంతంగా లాక్కెళ్లారు. చుట్టూ ఉన్నవారు ఈ ఘటనను చూసి అప్రమత్తమై వారిని ఆపేందుకు ప్రయత్నించారు. దీంతో నిందితులు హెచ్చరికగా కాల్పులు జరపడంతో వారు వెనక్కి తగ్గారు. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. బాలిక భర్త, బావమరిది, మరో ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వరకట్న వేధింపులు భరించలేక తిరిగి ఇంటికి వచ్చిన బాలిక చదువు కొనసాగిస్తోందని, అయినప్పటికీ కట్నం కోసం అత్తమామలు ఇంకా వేధిస్తూనే ఉన్నారని పోలీసులు తెలిపారు. కిడ్నాపర్ల కోసం మూడు బృందాలను రంగంలోకి దించినట్టు పేర్కొన్నారు.

Also Read : సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్ర‌భుత్వ స‌హ‌కారం ఉంటుంది... సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్‌!

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :