ఇస్రో చేపట్టిన GSLV-F17 ప్రయోగం విజయవంతమైంది. మూడు దశలను విజయవంతంగా పూర్తి చేసిన రాకెట్ EOS-05 శాటిలైట్‌ను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. సుమారు 36 వేల కిలోమీటర్ల ఎత్తు నుంచి భూభాగాల పర్యవేక్షణ, సరిహద్దుల్లో కదలికల గుర్తింపు, విపత్తుల ముందస్తు అంచనాకు ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది. రక్షణ వ్యవస్థలకు EOS-05 కీలకంగా మారనుంది.

