
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జగిత్యాలలో భారీ నిరసన నిర్వహించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్డీవో కార్యాలయం వద్ద విద్యార్థులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం కళాశాలలకు భారీగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాల్సి ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుతో పాటు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి అంశాలపై కూడా బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే విద్యార్థులతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

