
కరీంనగర్లో నిర్వహించిన బీఆర్ఎస్ ‘యువ సమరభేరి’ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందని, నిరుద్యోగులకు ఇచ్చిన ఉద్యోగాల హామీలను ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. యువత ఉద్యోగాలు అడిగితే అణచివేత చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సభకు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు, యువత, విద్యార్థి సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

