బీరంగూడ డివిజన్ పరిధిలోని వివిధ కాలనీల్లో పెండింగ్‌లో ఉన్న మౌలిక వసతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ అమీన్పూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శశిధర్ రెడ్డి కాలనీ వాసులతో కలిసి జోనల్ కమిషనర్ నారాయణ అమిత్ ఐఏఎస్‌ను కలిశారు. రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం తదితర సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
మల్లారెడ్డి కాలనీ, మారుతి నగర్, లక్ష్మీ సాయి మెడోస్, వందనపురి, బీహెచ్ఎల్ మెట్రో, ఎన్ఎస్ఎల్, లింగమయ్య కాలనీ తదితర ప్రాంతాల్లో పెండింగ్ అభివృద్ధి పనులను పరిశీలించి త్వరితగతిన ప్రారంభించాలని కోరారు. సమస్యల వివరాలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించగా, పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్లు శశిధర్ రెడ్డి తెలిపారు.

