భూ భారతి పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పేదలు, మధ్యతరగతి ప్రజలు, రైతుల భూములను సెక్షన్ 22Aలో చేర్చి ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీజేపీ తెలంగాణ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. భూమి హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్రంలోని బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి, ఇస్నాపూర్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు లకడారం శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. భూ హక్కులకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.

