వేములవాడ పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయంగా గడిపారు. అగ్రహారంలోని పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులతో సమావేశానికి వెళ్తున్న సమయంలో నంది కమాన్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి.
అనంతరం కేటీఆర్ అక్కడి టీ టైం పాయింట్‌కు వెళ్లి నాయకులు, కార్యకర్తలతో కలిసి టీ తాగుతూ కాసేపు సరదాగా ముచ్చటించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని ఆత్మీయంగా మాట్లాడారు. కేటీఆర్ తమ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించడంతో పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు.

