రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలోని పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జీవో 97ను రద్దు చేయాలని కోరుతూ విద్యార్థులు 20 రోజులకు పైగా కొనసాగిస్తున్న ఆందోళనకు ఆయన మద్దతు తెలిపారు.
పాలిటెక్నిక్ కళాశాలలను లేబర్ డిపార్ట్మెంట్ పరిధిలోకి తీసుకురావడం వల్ల విద్యార్థుల భవిష్యత్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని కేటీఆర్ అన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో జీవో 97 అంశాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రశ్నిస్తారని తెలిపారు. జీవో 97 రద్దు చేసి, ఎస్బీటీఈటీ కొనసాగించే వరకు విద్యార్థుల తరఫున పోరాటం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.

