బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులపై కుట్రపూరితంగా అక్రమ కేసులు పెడుతోందని ఆరోపిస్తూ జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని శాస్త్రి చౌరస్తా వద్ద కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగరావు కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో ఉత్తరాఖండ్ పోలీసులు రాహుల్ గాంధీపై నమోదు చేసిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు, అరెస్టులు కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని శాస్త్రి చౌరస్తా వద్ద కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగరావు కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో రాహుల్ గాంధీపై ఉత్తరాఖండ్ పోలీసులు నమోదు చేసిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులపై బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా అక్రమ కేసులు, అరెస్టులు చేస్తోందని వారు ఆరోపించారు. అక్రమ కేసులు కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు.


