విశాఖపట్నం పోర్ట్ అథారిటీ కోసం హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ నిర్మిస్తున్న రెండో 60 టన్నుల బొల్లార్డ్ పుల్ టగ్ VC 11206కు కీల్ లేయింగ్ కార్యక్రమం జరిగింది. VPA చైర్పర్సన్ జస్మీత్ సింగ్ బింద్రా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇప్పటికే తొలి టగ్ 60 శాతం నిర్మాణాన్ని పూర్తి చేసుకోగా, రెండు టగ్‌లు అక్టోబర్‌లో ఒకేసారి ఫ్లోట్ అవుట్ కానున్నాయి. పోర్టులో సురక్షిత బెర్తింగ్, టర్న్అరౌండ్ సమయాన్ని మెరుగుపరచడంతో పాటు భవిష్యత్‌లో ఎలక్ట్రిక్ టగ్, గ్రీన్ ఫ్లీట్, షిప్ రిపేర్, షిప్‌బిల్డింగ్ రంగాల్లో HSL–VPA భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

