విశాఖలో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బి.ఎస్. కృష్ణ ఆరోపించారు. మద్దిలపాలెంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాల తరలింపును నిలిపివేయాలని, విశాఖ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. సహజ వనరుల తరలింపుపై సమగ్ర విచారణ, నిత్యావసర ధరల నియంత్రణ, విద్యార్థుల భద్రతకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే దీక్షలు, నిరసనలు, ప్రజా ఉద్యమాలు చేపడతామని బి.ఎస్. కృష్ణ స్పష్టం చేశారు.

