శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రైల్వే స్టేషన్ పరిసరాల్లో పోలీసులు 8.100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు ఎస్ఐ యమ్. ముకుందరావు సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహిస్తుండగా గంజాయి సంచితో రైలు కోసం వేచి ఉన్న దాల బెహరా చిత్రసేన్ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి గంజాయితో పాటు మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని ముంబైకి తరలించేందుకు ఒక్కో ట్రిప్పుకు రూ.7,000 చెల్లిస్తానని ఓ వ్యక్తి చెప్పడంతో తాను అంగీకరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు అధికారులు తెలిపారు.

