రామచంద్రాపురం పరిధిలోని కొల్లూరు కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్ సముదాయంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విమర్శించారు. తాగునీరు, విద్యుత్, బస్తీ దవాఖానాలు, నీటి బిల్లులు, డ్రైనేజీ వంటి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులను నోటీసుల పేరుతో వేధించొద్దని హెచ్చరించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే నిలిపివేసిన సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామని, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తామని గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.

