జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో ఇండస్ టవర్స్ సంస్థ ఏర్పాటు చేసిన నూతన మొబైల్ టవర్ను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. ఈ టవర్ అందుబాటులోకి రావడంతో ఆలయానికి వచ్చే భక్తులు, స్థానిక ప్రజలకు మెరుగైన మొబైల్ నెట్వర్క్, కమ్యూనికేషన్ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. కార్యక్రమంలో దేవస్థాన ఈఓ అంజనా రెడ్డి, సర్పంచ్ ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

