
హైదరాబాద్ తార్నాకలోని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల వద్ద వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యాదవ కార్పొరేషన్ చైర్మన్ జగదీష్ యాదవ్, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చిరంజీవులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సంప్రదాయ ఉట్టి కొట్టే కార్యక్రమంలో అతిథులు, విద్యార్థి సంఘాల నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీకృష్ణుడు బోధించిన ధర్మం, న్యాయం, సమాజ శ్రేయస్సు వంటి విలువలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. సమాజంలో ధర్మబద్ధమైన విలువలను పెంపొందిస్తూ సామాజిక తెలంగాణ సాధన కోసం యువత కృషి చేయాలని సూచించారు.

