నిజామాబాద్ రూరల్ మండలం తిర్మాన్పల్లి గ్రామంలో ‘ఒకే ఊరు.. ఒకే వినాయకుడు’ అనే నినాదంతో గ్రామస్తులంతా కలిసి ఒకే చోట మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి వినాయక మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలంతా ఐక్యంగా ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
ఒకే మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించడం ద్వారా ఐక్యత, సోదరభావం, పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని గ్రామస్తులు చాటారని ఎమ్మెల్యే తెలిపారు. తిర్మాన్పల్లి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొంటూ, గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, వినాయక మండలి నిర్వాహకులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.

