మంచిర్యాల నియోజకవర్గంలో విద్య, వైద్యం, సాగునీరు, రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధికి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు కృషి చేస్తున్నారని జెండా వెంకటాపూర్ పీఏసీఎస్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చల్ల నాగభూషణం పేర్కొన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు జన్మదినాన్ని పురస్కరించుకుని లక్షెట్టిపేట విశ్రాంతి భవన్ ఆవరణలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు జన్మదిన వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.
మంచిర్యాల నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయిస్తూ పనులను వేగవంతం చేస్తున్నారని చల్ల నాగభూషణం తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అన్ని రంగాల్లో అభివృద్ధికి ఎమ్మెల్యే చొరవ చూపుతున్నారని పేర్కొన్నారు. అనంతరం లక్షెట్టిపేట పాత బస్టాండ్ వద్ద ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ, మండల నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్, పీఏసీఎస్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

