నిజామాబాద్ జిల్లా సిరికొండ గ్రామానికి చెందిన పారిపల్లి సాయి కుమార్ (32) స్థానిక ఎల్లమ్మ చెరువులో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన చోటుచేసుకుంది. సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో ఈ ఘటనను గమనించిన గ్రామస్తులు వెంటనే చెరువులోకి దిగి సాయి కుమార్ను బయటకు తీసి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు.
అయితే ఆసుపత్రికి తరలించేలోపే సాయి కుమార్ మృతి చెందినట్లు సమాచారం. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిరికొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

