నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని హుస్సేన్ నగర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం మైక్ సెట్ ఏర్పాటు కోసం డీసీసీ ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి రూ.11 వేల విరాళం అందజేశారు. గ్రామ సర్పంచ్ మల్లేష్ యాదవ్ అభ్యర్థన మేరకు ఆయన ఈ సహాయం అందించారు.
విద్యార్థుల అవసరాన్ని గుర్తించి విరాళం అందించిన వెల్మ భాస్కర్ రెడ్డికి గ్రామ సర్పంచ్, గ్రామస్తులు, విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాకారం రవి, బాకారం సంతోష్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

