ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రరావు (నాగబాబు)కు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తూ జీతభత్యాలు, వ్యక్తిగత సిబ్బంది నియామకం, ఇతర ప్రయోజనాలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం ఖరారు చేసింది.
కేబినెట్ హోదా ఉన్న వారికి వర్తించే నిబంధనల ప్రకారం నాగబాబుకు నెలకు రూ.2 లక్షల జీతంతో పాటు ఇతర అలవెన్సులు, సౌకర్యాలు వర్తించనున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలువురికి ఇప్పటికే కేబినెట్ హోదా కల్పించగా, తాజాగా ఆ జాబితాలో నాగబాబు చేరారు.

