బాన్సువాడ నియోజకవర్గ ప్రజలే తన కుటుంబమని ఆయన అన్నారు. హైదరాబాద్లో ఉన్న భార్య, కొడుకులు, కూతురు, కోడళ్లు, మనవళ్లు, మనుమరాళ్లతో పాటు బాన్సువాడ నియోజకవర్గంలోని ప్రతి కుటుంబాన్ని తన కుటుంబంగానే భావిస్తానని తెలిపారు.
అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప హైదరాబాద్ వెళ్లాలని అనిపించదని చెప్పారు. అక్కడ తన కుటుంబంతో కొంత సమయం గడుపుతానని, తన మనవళ్లు చిన్నప్పటి నుంచి తన దగ్గరే పెరిగారని గుర్తు చేసుకున్నారు.
మనవళ్లు గుర్తొచ్చినప్పుడు హైదరాబాద్ వెళ్లి వారిని చూసి వస్తానని, వారిని చూసిన ఆనందంతో మళ్లీ బాన్సువాడకు తిరిగి వచ్చేస్తానని తెలిపారు. ప్రజలతో తనకున్న అనుబంధాన్ని, బాన్సువాడపై తనకున్న అభిమానాన్ని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.

