నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో పంట పొలాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ బీజేపీ మండల అధ్యక్షుడు జీర్రా మహిపాల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ అంతరాయాలు, పంటలకు సాగునీరు అందడంలో ఎదురవుతున్న ఇబ్బందులను బీజేపీ నాయకులు వివరించారు.
రైతులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడంతో పాటు పంట పొలాల్లో ఉన్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ధర్పల్లి సబ్స్టేషన్లో ఏఈ రూప్ సాయికి బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. రైతుల సమస్యలను అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కర్క గంగారెడ్డి, సరిచంద్, కర్రోల శ్రీకాంత్, సదానంద్ గౌడ్, నరేష్ గౌడ్, పాలెపు సుమన్, రఘుపతి రెడ్డి, అమ్రూ నాయక్, దోర్నాల రాజశేఖర్, శ్రీనివాస్ రెడ్డి, గోపి తదితరులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

