నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో పంట పొలాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీజేపీ మండల అధ్యక్షుడు జీర్రా మహిపాల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ ఇబ్బందులు, పంటలకు సాగునీరు అందడంలో ఎదురవుతున్న సమస్యలను ఈ సందర్భంగా నాయకులు వివరించారు.
అనంతరం ధర్పల్లి సబ్స్టేషన్లో ఏఈ రూప్ సాయికి బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. రైతులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడంతో పాటు పంట పొలాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కర్క గంగారెడ్డి, సరిచంద్, కర్రోల శ్రీకాంత్, సదానంద్ గౌడ్, నరేష్ గౌడ్, పాలెపు సుమన్, రఘుపతి రెడ్డి, అమ్రూ నాయక్, దోర్నాల రాజశేఖర్, శ్రీనివాస్ రెడ్డి, గోపి తదితరులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

