జగిత్యాల పట్టణంలో రాబోయే గణేష్ ఉత్సవాలను ప్రజా జీవనానికి, ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని టౌన్ సీఐ కరుణాకర్ సూచించారు. గణేష్ మండపాలను విద్యుత్ తీగలకు దూరంగా ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. మండపాల్లో భక్తి పాటలు మాత్రమే ప్రసారం చేయాలని, గణేష్ ఆగమన్ కార్యక్రమాలను కూడా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని తెలిపారు.
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచనల మేరకు డీఎస్పీ పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 12న దేవిశ్రీ గార్డెన్లో గణేష్ మండప నిర్వాహకులు, గణేష్ ఉత్సవ సమితి సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు సీఐ కరుణాకర్ వెల్లడించారు. ఉత్సవాల సందర్భంగా భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించిన అంశాలపై నిర్వాహకులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.

